ఒకప్పటితో పోలిస్తే నేటి మానవుడు ఎక్కువగా సుఖాలకు అలవాటుపడుతూ, తన శరీరాన్ని అలానే మనసుని ఎన్నో ఇబ్బందుల పాలు చేసుకుంటున్నాడు అనే చెప్పాలి. మనలోని ఎక్కువమంది శరీరానికి శ్రమ లేకుండా చేయడంతో ఎక్కువగా ఊబకాయం, మానసిక, శారీరక సమస్యల బారిన పడుతున్నారు. ఇక ముఖ్యంగా నేటి యువతను పట్టి పీడిస్తున్న సమస్యల్లో నిద్ర లేని సమస్య కూడా ఒకటి. ఇక ఎక్కువమంది సిటీ లోని యువత, నైట్ షిఫ్ట్స్ వంటివి చేయడంతో సమయానికి నిద్ర పట్టక మైగ్రేన్ తలనొప్పి, మానసిక వేదన, టెన్షన్ వంటి వాటితో బాధింపబడుతున్నారు. అయితే మనిషికి తిండి, నీరుతో పాటు అత్యంత ఆవశ్యకమైన నిద్రను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని డాక్టర్లు కూడా సూచిస్తున్నారు. 

ఇక డైలీ సరిగ్గా నిద్ర పట్టకపోవడంతో, మనలోని కొందరు డాక్టర్లను ఆశ్రయించి నిద్రకు మందులు కూడా తీసుకుంటున్నారు. అయితే కొందరు వైద్యులు చెప్తున్న దానిని బట్టి, డైలీ సుఖంగా నిద్ర పట్టడానికి పెద్దగా శ్రమ పడవలసిన అవసరం లేదని, అయితే ఇప్పుడు చెప్పుకునే ఒక సింపుల్ విధానంతో మెల్లగా నిద్రలోకి జారుకోవచ్చని అంటున్నారు. దాని ప్రకారం, డైలీ నిద్రకు ఉపక్రమించే ముందు గ్లాస్ పాలల్లో ఒక స్పూన్ తేనె వేసుకుని త్రాగాలని, అలానే మధ్యలో అప్పుడప్పుడు దాల్చిన చక్క పొడి, యాలుకల పొడి వంటివి కూడా కలుపుకుంటే, అది మెల్లగా మెదడుని నిద్రకు ఉపక్రమించేలా చేస్తుందని అంటున్నారు. ఈ విధంగా తరచు తూచా తప్పకుండా పాటిస్తే, అతి తక్కువ కాలంలోనే మనకు నిద్ర లేమి సమస్య తగ్గుతుందని కూడా చెప్తున్నారు. అయితే కేవలం ఇలా చేయడం మాత్రమే కాక, 

దీనితో పాటు ప్రతిఒక్కరు కూడా కొన్ని ముఖ్య విషయాలు గుర్తు పెట్టుకోవాలంటున్నారు. అవేంటంటే, డైలీ వీలైనంత త్వరగా మన కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరగా పడుకోవడం అలవాటు చేసుకోవాలని, ఇక నిద్రపోయే సమయంలో ఎక్కువగా మనసులోకి ఎటువంటి ఆలోచనలు రాకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలని, అన్నిటికంటే ముఖ్యంగా టివి, కంప్యూటర్, సెల్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు మన ప్రక్కన లేకుండా దూరంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. సో, విన్నారుగా ఫ్రెండ్స్, ఈ కొద్దిపాటి చిన్న పద్దతులతో డైలీ ప్రశాంతంగా నిద్రించండి..... !!


మరింత సమాచారం తెలుసుకోండి: