కావాల్సిన‌ పదార్థాలు:
ఉడికించిన అరటికాయ తురుము- ఒక కప్పు
అల్లంవెల్లుల్లి పేస్టు- ఒక చెంచా
పెసరపప్పు- ఒక కప్పు
కందిపప్పు- ఒక కప్పు


సెనగపప్పు- ఒక కప్పు
మినపపప్పు- ఒక కప్పు
ఉల్లిగడ్డలు- రెండు


మసాలా- ఒక చెంచా
కొత్తిమీర- రెండు కట్టలు
పుదీన- రెండు కట్టలు
కారం- తగినంత


ఉప్పు- తగినంత
పచ్చిమిర్చి- 100 గ్రా
నూనె - తగినంత


తయారీ:
ముందుగా కందిప‌ప్పు, సెన‌గ‌ప‌ప్పు, పెస‌ర‌ప‌ప్పు మ‌రియు మిన‌ప‌ప‌ప్పుల‌ను నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత వాటిని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఉడికించిన అరటికాయ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇందులోనే కారం, ఉప్పు, పచ్చిమిరపకాయల పేస్ట్‌, ఉల్లిగడ్డ ముక్కలు, మసాలా, కొత్తిమీర తరుగు, పుదీన ఆకులు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి బాగా కలపాలి.


ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి నూనె పోయాలి. వేడి అయ్యాక ఈ పిండిని వడలుగా చేసి వేయించుకోవాలి. అంతే అరటికాయ వడలు రెడీ..!వీటిని ఏదైనా సోస్‌తో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అర‌టికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఆర‌టికూయ కూర‌లు తిన‌ని వారు ఇలా వ‌డ‌లు వేసుకొంటే బాగా ఇష్ట‌ప‌డ‌తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: