ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అండతోనే  రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ -3 టైటిల్  విజేత గా నిలిచాడా? అంటే అవుననే , ఈ కుర్ర సింగర్  కూడా అంగీకరిస్తున్నాడు .  బిగ్ బాస్ -3 షో ప్రారంభమయినప్పుడు రాహుల్ పై పెద్దగా ఎవరికీ ఎటువంటి  అంచనాలు లేవు . అతడు టైటిల్ గెలుస్తాడని ఎవరు భావించలేదు . కానీ బిగ్ బాస్ షో కొనసాగుతున్న కొద్దీ రాహుల్ ప్రత్యేకార్షణగా నిలుస్తూ వచ్చాడు .


హౌస్ లో తోటి కాంటెస్ట్ పునర్నవి తో ప్రేమాయణం , అతని సాదాసీదా  వ్యవహార శైలి ఇలా అన్ని రాహుల్ ను  ప్రేక్షకులకు దగ్గర చేశాయి . 17  మంది కంటెస్టెంట్స్ పోటీ పడిన ఈ రియాల్టీ షోలో అందర్నీ వెనక్కినెట్టి ప్రేక్షకుల ఓట్ల ద్వారా రాహుల్ విజేత గా నిలిచాడు. అంతటి ఫ్యాన్ పాలోయింగ్ రాహుల్ కు  ఉందా? అన్న అనుమానాలు కూడా చాలామందికి  లేకపోలేదు . బిగ్ బాస్ విజేతగా నిలిచిన రాహుల్ తన బలం, బలహీనతల గురించి పలు టీవీ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు . బయట తాను ఎలా ఉంటానో , బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాగే ఉండడం వల్లే తనని ప్రేక్షకులు గెలిపించారని భావిస్తున్నట్లు తెలిపాడు . ఇక తన గెలుపు కు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఒక కారణమై ఉంటాడని తన స్నేహితులు చెప్పారని అన్నాడు .


రాహుల్ గెలుపు కు అసలు జగన్ కు ఉన్న సంబంధం ఏమిటన్న అనుమానం ప్రతి ఒక్కరికి కలగడం  ఖాయం . ఎన్నికల ముందు రాహుల్ స్వయంగా కంపోజ్ చేసి జగన్ కోసం ఒక పాట పాడాడు. అది అప్పట్లో వైరల్ అయింది . జగన్ అభిమానులు , ఆ పార్టీ కార్యకర్తలు రాహుల్ కు గంపగుత్త గా  ఓటేసి గెలిపించారన్న టాక్ విన్పిస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: