భోజ మహారాజు ఒక నాడు తన ఆస్థాన పండితుల తో “మోక్షానికి పోగలిగే వాడెవ్వడు” అంటూ ప్రశ్నించాడట. మహా క్రతువుల తో పోవచ్చు నని కొందరు,జ్ఞానం పొందితే పోవచ్చు నని కొందరు, భక్తి తో పోవచ్చు నని కొందరు, సత్సంగము తో పోవచ్చు నని కొందరు,
అలా దాని తో పోవచ్చు దీని తో పోవచ్చు అంటూ ఒక్కొక్కరు ఒక్కో విధముగ చెప్పుకు పోతున్నారు.


కాళిదాసు లేచి “నేను పోతే పోవచ్చు” అని అన్నాడు. ఆ మాట తక్కిన వారికి చుర్రు మనిపించింది.“ఇతడేనా మోక్షాని కి పోయే వాడు” అంటూ ఆక్షేపణలు మొదలయ్యాయి. కాళిదాసు లేచి “మహా ప్రభూ! "నేను" అనే అహంకారం పోతే, ఎవడైనా సరే పోవచ్చును అన్నాను. గాని, నేను పోతానంటు చెప్పలేదండీ” అని సమాధాన మిచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: