కావాల్సిన ప‌దార్థాలు:
కారెట్‌ తురుము - ఒక‌టిన్న‌ర‌ కప్పు
కొబ్బరి కోరు- ఒక‌ కప్పు
మినప్పప్పు- ఒక టేబుల్ స్పూన్‌
ఆవాలు- ఒక టేబుల్ స్పూన్‌


ఇంగువ- అర టీ స్పూన్‌
ట‌మాట‌- రెండు
నూనె- సరిపడా
పచ్చిమిరపకాయలు- మూడు


ఎండు మిరపకాయలు- మూడు
ఉప్పు- రుచికి సరిపడా
కొత్తిమీర- కొద్దిగా


తయారీ విధానం:
ముందుగా స్టౌ మీద పాన్ పెట్టుకొని నూనె పోసి క్యారెట్‌కోరు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత టమాట ముక్కలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పాన్‌ పెట్టి నూనె పోసి మినపప్పు, ఎండు మిరపకాయలు, ఆవాలు వేయించాలి. చల్లారిన తర్వాత గ్రైండ్‌ చేసి ముందుగా వేయించిన క్యారెట్‌, టమాటా ముక్కలు, కొబ్బరి కోరు  వేసి కొంచెం నీళ్ళు వేసి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి.


ఇప్పుడు పాన్‌లో నూనెపోసి ఆవాలు, కరివేపాకు, ఇంగువ, వేయించి పచ్చడిలో వేయాలి. పైన గార్నిష్‌ కోసం కొంచెం కొత్తిమీర వేస్తే స‌రిపోతుంది. అంతే ఎంతో రుచిక‌ర‌మైన క్యారెట్‌ చట్నీ రెడీ.. రైస్‌తో లేదా రోటీతో దీని కాంబినేష‌న్ చాలా టేస్టీగా ఉంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: