పూర్వ కాలం నుండి చెట్లను పూజించడం మన హిందూ సాంప్రదాయం.. అలా చేస్తున్న వారు పురాణాల ప్రకారం ఎప్పటి వరకు నమ్ముతూ వస్తున్నారు. ఇకపోతే ఇక్కడ ఒక విషయం చోటు చేసుకుంది. ఓ అడవుల్లో ఓ చెట్టు ఉందట. ఆ చెట్టుకు చాల మహిమలు ఉన్నాయట దానివల్ల మనిషికి ఉన్న రోగాలన్నీ మాయమవుతాయని అంటున్నారు. వాటిలో ఎంతవరకు నిజముందో ఇప్పుడు చూద్దాం.. నిజంగానే ఆ చెట్టుకు మహిమలు ఉన్నాయా లేదా.. 


వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ అడవుల్లో ఒక చెట్టు ఉందట ఆ చెట్టును అలా తాకడం వల్ల ఉన్న రోగాలన్నీ పోతాయట. ఆ విషయాన్నీ ఓ వ్యక్తి చెప్పాడు. దానితో ఎక్కడెక్కడి నుండో చెట్టును చూడటానికి జనాలు వెళ్తున్నారట. ఐసీయూ ఉన్న రోగులు కూడా ఈ వినుతాను చుడటానికి వస్తున్నారట. అడవుల్లో ఉన్న ఈ చెట్టును తాకడానికి ఎక్కడెక్కడి నుండో జనాలు వస్తున్నారు. 


అసలు ఈ చెట్టు ఎక్కడుందంటే.. మధ్యప్రదేశ్లోని అడవుల్లో ఒక చెట్టు ఉందట ఆ చెట్టు ఎటువంటి రోగాలనైనా కూడా యిట్టె మాయమచేస్తుందనే వార్తలు వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లో సాత్పురా టైగర్ రిజర్వ్‌ పరిసర ప్రాంతాల్లో ఈ చెట్టు ఉంది. చెట్టు పేరు మాత్రం ఎక్కడ చెప్పలేదు.. కానీ, ఈ చెట్టు పాపులారిటీ మాత్రం భారీగా పెరిపోతుంది. 


ఒక అతను ఈ చెట్టు దగ్గరకు వెళ్ళాడు అతనికున్న జబ్బు నయమైందని పుకార్లు వచ్చాయి. దీనితో అక్కడకు వేలాది మంది వచ్చి వెళ్తున్నారు. జనం ఎక్కువగా రావడంతో ఆ పరిసర ప్రాంతాల్లో చిరు వ్యాపారులు సొమ్ము చేసుకోవడానికి రెడీ అయ్యారు. ఇది ఇలా ఉండగా చెట్టు తాకడం వల్ల జబ్బులు తగ్గాయి లేదో తెలియదు కానీ చెత్తమాత్రం బాగా పెరిగిందని అటవీశాఖాధికారులు వెల్లడిస్తున్నారు. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉందండీ.. ఎవరైతే ఈ మహిమలున్న చెట్టు గురించి చెప్పారో అతను అనుకోకుండా చనిపోయాడట.. ఎందుకు చనిపోయాడు అన్న విషయం మాత్రం ఇక్క డా తెలియడం లేదు.. ఏది ఏమైనా చెట్టు మాత్రం బాగా ఫెమస్ అయింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: