కావాల్సిన ప‌దార్థాలు:
మటన్‌- అరకిలో
పెరుగు- ఒక కప్పు
బిర్యాని ఆకులు- రెండు


ఆవనూనె- ఒక‌ కప్పు
అల్లంతురుము- ఒక టీస్పూను
ఉప్పు- రుచికి సరిపడా
వెల్లుల్లిరెబ్బలు- పది


పసుపు- టీస్పూను
గరంమసాలా- టేబుల్‌స్పూను
కొత్తిమీర‌- కొద్దిగా


త‌యారీ విధానం: 
ముందుగా మ‌ట‌న్ శుభ్రం చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగుని తీసుకొని బాగా గిల‌కొట్టాలి. ఇప్పుడు మ‌రో బౌల్‌లో మ‌ట‌న్ ముక్క‌లు వేసి అందులో టేబుల్‌స్పూను నూనె, పసుపు, ఉప్పు, పెరుగు పట్టించి రెండు గంటల పాటు నాననివ్వాలి. ఇప్పుడు స్టౌ ఆన్ చేసి పాట్ పెట్టి.. అందులో నూనె పోయాలి. 


నూనె కాగాక అందులోనే అల్లం, వెల్లుల్లి, పలావు ఆకులు వేసి ఓ నిమిషం వేయించాలి. తరవాత అన్నీ పట్టించిన మటన్‌ ముక్కలు వేసి సిమ్‌లో ఉంచి ఉడికించాలి. చివరగా గరంమసాలా, కొత్తిమీర  వేసి బాగా కలిపి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే సండే స్పెష‌ల్ మటన్ ఫ్రై రెడీ.. రైస్‌తో దీని కాంబినేష‌న్ అదిరిపోతుంది. అలాగే మ‌ట‌న్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో.. త‌ప్ప‌కుండా ట్రై చేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి: