ఆస్థమా ప్రస్తుతం ప్రపంచంలో పలువురిని వేధిస్తున్న సమస్య.ఆధునిక జీవన శైలి,కాలుష్యం కారణంగా పలువురు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీర్ఘకాలిక శ్వాసకోశ ఇబ్బందినే ఆస్తమా అంటారు. ఆస్తమా వ్యాధిగ్రస్తులలో అలర్జీ రియాక్షన్ ద్వారా ఊపిరితిత్తులలో గాలిమార్గంకు అడ్డంకులు ఏర్పడి శ్వాసపీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లికూతలు, దగ్గు, ఆయాసం, ఛాతీలో నొప్పి తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. శ్వాసకోశమార్గంలో వాపు, శ్వాసకోశ మార్గం కుచించుకపోవడం వల్ల ఆస్తమా ఏర్పడుతుంది.


ఆస్థమా ఉన్నవారు ఖ‌చ్చితంగా జాగ్ర‌త్త‌లు పాటించాలి. అప్పుడే ఆస్త‌మాను అదుపులో ఉంచ‌గ‌లం. అయితే ముఖ్యంగా ధూమపానానికి, ధూమపానం చేసేవారికి దూరం గా ఉండాలి. డస్ట్‌మైట్స్‌ రాకుండా దుప్పట్లు, దిండ్ల కవర్లు ప్రతివారం వేడినీటిలో తరచూ ఉతికి ఎండలో ఆరబెట్టాలి. ఆరోగ్యకరమైన అలవాట్లు, వ్యాయామం, పోషకాహారం తీసుకున్నట్లయితే ఆస్తమా ఉండ‌చ‌గ‌లం. అదే విధంగా.. చల్లని గాలిలో తిర‌గ‌డం, వ‌ర్షంలో త‌డ‌వ‌డం వంటివి అస‌లు చేయ‌కూడ‌దు.


ఆస్తమాతో బాధపడేవారు ఇంగువను తీసుకోవడం వల్ల సమస్య అదుపులో ఉంటుంది. ఇట్లో బూజులు దులపడం లాంటివి ఆస్థమా ఉన్నవారు చేయకూడదు. అలాగే పెంపుడు జంతువులని సాధ్యమై నంత దూరంగా ఉంచాలి. ఇంట్లో పురుగు మందులను స్ప్రే చేసేటప్పుడు ఇంట్లో ఉండకూడదు. శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌లు, ఫ్రిజ్‌ వాటర్‌ వంటి పడని పదార్థాలకు దూరంగా ఉండాలి. వ్యాధి అదుపులోకి వచ్చిన తరువాత మందు పరిమాణము కొద్ది కొద్దిగా తగ్గిస్తూ అతి తక్కువ డోస్‌తో వ్యాధి అదుపులో ఉండేటట్లు చూసుకోవాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: