సాధార‌ణంగా ముఖం అందంగా క‌నిపించాలంటే వారి దంతాలు కూడా అందంగా క‌న‌ప‌డాలి.  దంతాలు తెల్లగా మరియు మెరుస్తుండేలా ఉంచుకోవడం చాలా మందికి ఇష్టం. అయితే ఎదుటివారు మనల్ని చూడగానే ఆకర్షించేది నవ్వు.. నవ్వుకి దంతాలు రెట్టింపు అందాన్ని ఇస్తాయి. దంతాలు పసుపు పచ్చరంగులో ఉంటే నలుగురిలో నవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే, ఎప్పుడూ దంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. స్వీట్లు, జంక్‌ఫుడ్‌, ఇత‌ర కొన్ని ఆహార ప‌దార్థాల కారణంగా దంతాల మ‌ధ్య కావిటీలు వ‌చ్చి దంతాలు పుచ్చిపోతాయి. వాటిని త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోపోతే చాలా న‌ష్ట‌పోతాం.


దంతాలు తెల్ల‌గా.. ఆక‌ర్ష‌నీయంగా ఉండాలంటే తులసి ఆకులను నీడలోనే ఎండ బెట్టిన తర్వాత మెత్తగా నూరి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఉపయోగించి బ్రష్ చేయటంవల్ల దంతాలపై పసుపు రంగును దూరం చేసుకోవచ్చు. చిగుళ్ల‌ను దృఢంగా చేసి దంతాల‌ను తెల్ల‌గా మార్చే ఔష‌ధ గుణాలు యాపిల్స్‌లో ఉన్నాయి. అంతే కాదు, యాపిల్స్ వ‌ల్ల నోట్లో ఉమ్మి కూడా బాగా త‌యార‌వుతుంది. ఇది నోట్లో ఉండే చెడు బాక్టీరియాను నాశ‌నం చేస్తుంది. నిమ్మ సహజంగా సిట్రిక్ యాసిడ్ కలిగి ఉంటుంది, ఈ సిట్రిక్ యాసిడ్ కు ఉప్పు చేర్చడం వల్ల ఈ రెండింటి మిశ్రం సహజంగానే దంతాలు తళతళలాడేలా చేస్తాయి.


నారింజ పండ్లలో సిట్రస్ ఆసిడ్ ఉండటం వల్ల ఇవి పళ్ళ పైన ఉండే ఎనామిల్ పొరని తెల్లగా మార్చి దంతాలు తెల్లగా కనపడేలా చేస్తుంది. ఎక్కువ సిట్రస్ తీసుకోవటం వలన దంతాల పైన ఉండే ఎనామిల్ పొర కుడా తొలగిపోతుంది. వేప, నల్ల తుమ్మ పుల్లలతో తోముకున్నా కూడా దంతాల మీది మరకలు త్వరగా పోతాయి. వేపలో ఉండే యాస్ట్రింజెంట్లు, యాంటీ సెప్టిక్‌ గుణాలు పంటికి రక్షణ కల్పించి, దుర్వాసనను పోగొడతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: