ఫ్రిజ్.. ఈ కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ ఫ్రిజ్ ఉంటుంది. పట్టణాల్లో అయితే ఫ్రిజ్ లేని ఇల్లు ఉండదు. అయితే ఫ్రిజ్ పని తీరు బాగుండాలంటే.. దానికి సంబంధించిన నిర్వహణ విషయంలో తగినంత అవగాహనా లేని కారణంగా ఒక్కోసారి చిన్న చిన్న సమస్యలు ఎదురువుతుంటాయి. అయితే ఆ సమస్యలు గురించి ఇప్పుడు తెలుసుకోండి. అయితే ఆ ఫ్రిజ్ నిర్వహణ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఆ జాగ్రత్తలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 


ఫ్రిజ్ అద్భుతంగా పనిచేయాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. 


కొత్తగా ఫ్రిజ్ కొన్నపుడు అరగంట పాటు ఫ్రిజ్ తలుపు తెరిచి ఉంచాలి. అప్పుడే ఫ్రిజ్ పనితీరు బాగా పనిచేస్తుంది. 


వాడే పాత మోడల్ ఫ్రిజ్‌‌ అయితే దానికి స్టెబిలైజర్ తప్పనిసరిగా వాడాలి. ప్రస్తుతం వచ్చే ఫ్రిజ్ లకు స్టెబిలైజర్ లోపలే ఉంటాయి కాబట్టి  విడిగా స్టెబిలైజర్ అవసరం లేదు.


నెలకు ఒకసారైనా ఫ్రిజ్‌ లోని పదార్థాలన్నీ బయటపెట్టి లోపలి ట్రేలు కడిగి ఆరనివ్వాలి. బయటివైపు శుభ్రం చేసేందుకు కోలిన్ లిక్విడ్ వాడితే మంచిది. 


2 గంటలకు మించి విద్యుత్ కోత ఉన్నప్పుడు ఫ్రిజ్ తెరిచి పెట్టాలి, లేకుంటే లోపలి పదార్ధాలు పాడయ్యే అవకాశం ఉంటుంది. 


హీటర్లు, స్టవ్‌ ఉన్నచోట, అధికవేడి ఉండేచోట, ఎండ పడే చోట ఫ్రిజ్ పెట్టకూడదు, స్వచ్చమైన గాలి తగిలేచోట ఫ్రిజ్ పెడితే మంచి పనితీరు ఉంటుంది. 


ఫ్రిజ్‌లు రాత్రి భారీ శబ్ధాలు గమనిస్తే డీలర్‌ను సంప్రదించి రిపేర్ చేయిస్తే మంచిది. 


చూశారుగా.. ఈ చిట్కాలు పాటించి ఫ్రిజ్ ని జాగ్రత్తగా ఉపయోగించుకొండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: