అపర  కుబేరులు ఇతరులకు సహాయం చేయడమన్నది సర్వసాధారణం ... ఎందుకంటే తమ వద్ద అవసరానికి మించి ఉన్న దాన్ని ఇతరులకు పంచి వారు  ఆనందపడుతుంటారు . మరికొంతమంది ఆ పని కూడా చేయలేరు ... అది వేరే విషయం అనుకోండి  .  కానీ  సాధారణ జీవితం గడుపుతూ కూడా ఇతరుల సంక్షేమం గురించి అలోచించి తనకు తోచిన సహాయం చేయడమన్నది  నిజమైన దాతృత్వం . అటువంటి మహా కార్యాన్ని చేశాడు హుజుర్‌నగర్‌కు చెందిన వయో వృద్ధుడైన ఒక  కిరాణ దుకాణం యజమాని.   తన జీవితకాలంలో   పొదుపు చేసిన  50 లక్షల రూపాయల ను  భారత సాయుధ దళాల సంక్షేమం కోసం గవర్నర్ కు అందజేశాడు .


 హుజూర్ నగర్ లో కిరాణా దుకాణం నిర్వహించే సిరిపురం  విశ్వనాథం  సాయుధ దళాల ఫ్లాగ్ డే ఫండ్ కోసం తన దాచుకున్న మొత్తం సొమ్మును  చెక్ రూపం లో  తెలంగాణ గవర్నర్ తమిళసై కి అందజేయగా , ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆయన ఔదార్యాన్ని చూసి ...ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు . దేశం లో అక్రమ సంపాదనకు అలవాటుపడిన వ్యాపారాలు , బ్యూరోక్రాట్లు , రాజకీయనాయకులు తమ తోటి వారి సంక్షేమం గురించి పట్టించుకోకుండా నల్ల ధనాన్ని విదేశీ బ్యాంక్ ల్లో దాచుకుంటుంటే , ఒక సామాన్యుడు మాత్రం తన దేశ రక్షణ కోసం అసువులు బాసిన అమరుల కుటుంబాల సంక్షేమానికి , జీవితకాలం లో పొదుపు చేసిన మొత్తాన్ని విరాళంగా అందజేసి అందరికి ఆదర్శంగా నిలిచాడు .


 సాయుధ దళాల ఫ్లాగ్ డే ఫండ్ కోసం 50 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసిన సిరిపురం విశ్వనాథం ను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ శాలువా తో ఘనంగా సత్కరించి అభినందించారు .


మరింత సమాచారం తెలుసుకోండి: