చాల మందికి  ఏనుగు అంటే చాల ఇష్టం. అసోంలోని గోల్పారా జిల్లాలోని అడవుల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ఓ ఏనుగుకు ఇక్కడి ప్రజలు ‘ఒసామా బిన్ లాడెన్' అనే పేరుకూడా పెట్టడం  జరిగింది. ఆ పేరు వింటేనే ఇక్కడి ప్రజలు బయపడి పోతున్నారు. ఆ ఏనుగును పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు, ప్రజలు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు.


ఐతే ఓ రోజు రాత్రి ఆ ‘ఒసామా బిన్ లాడెన్' ఏనుగు ఐదుగురు గ్రామస్తుల ప్రాణాలు తీయడంతో ఈ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది అంటే నమ్మండి. అంతే కాకుండా, ఆ అటవీ ప్రాంతం గుండా రహదారిపై వెళ్లాలన్నా ప్రజలు, వాహనదారులు కూడా భయ భ్రాంతులు అవుతున్నారు. ఈ కారణంతో అటవీశాఖ అధికారులకు మొరపెట్టు కోవడం జరిగింది. ఆ ఏనుగును ఎలాగైనా పట్టుకోవాలని అని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.


ఈ క్రమం లోనే  ఆ ఒసామా బిన్ లాడెన్ ఏనుగును పట్టుకునేందుకు ఎనిమిదిమంది అటవీశాఖ అధికారులు రంగంలోకి ప్రవేశ పెట్టారు. ఆ ఏనుగును పట్టుకునేందుకు డ్రోన్లను కూడా ఉపయోగించడం జరిగింది. ఎట్టకేలకు తాజాగా ఆ ఏనుగు జాడ కనిపెట్టేశారు. ఆ తర్వాత ఇద్దరు నిపుణులు ఆ ఏనుగును శాంతపర్చి.. రెండు బాణాలతో మత్తుమందిచ్చి పట్టు కోవడం జరిగింది.


ఇప్పుడు ఆ ఏనుగును జనావాసాలకు దూరంగా.. పెద్ద అటవీ ప్రాంతంలో వదిలేసే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. అక్టోబర్ నెలలో కేవలం 24 గంటల్లోనే ఆ ఒసామా బిన్ లాడెన్ ఏనుగు గోల్పారా జిల్లాలో ఐదుగురు గ్రామస్తుల ప్రాణాలు తీయడం జరిగింది. ఈ ఏనుగు దాడిలో మరణించినవారిలో ముగ్గురు మహిళలు కూడా ఉండడం గమనార్థకం. కాగా, గత ఐదేళ్లలో ఏనుగుల దాడిలో మనదేశంలో సుమారు 2300 మంది ప్రాణాలు కోల్పోవడం కూడా గమనించవలసిన విషయం. అదే క్రమంలో 2011 నుంచి 700 ఏనుగులు కూడా  చంపేయడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: