ధనవంతులు అంటే ఎవరు ? మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా ? మీరు ఎప్పుడైనా ధనవంతులు కావాలనుకున్నారా ? మధ్యతరగతిలో పుట్టిన వారు అయితే ఖచ్చితంగా ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు. కానీ ధనవంతులు ఎలా అవ్వాలనుకున్నారు ? డబ్బు సంపాదించా ? లేక ప్రజల మనసు సంపాదించా ? 


ఇవి అన్ని ఏమి ఐడియా ఉండదు అబ్బా.. ధనవంతులు అవ్వాలి. డబ్బు సంపాదించాలి. అంబానీ అంత కాకపోయినా అంబానీకి దగ్గర్లో అయ్యి పక్క వారికీ సహాయం చెయ్యాలి అనుకుంటారు. మరి కొంతమంది ధనవంతులు కాకపోయినా పర్వాలేదు పక్క వారికీ సహాయం చెయ్యాల్సిన సమయంలో సహాయం చేస్తే చాలు అని అనుకుంటారు. 


వీరి ఇద్దరిలో ఎవరు గొప్ప ? అని అడిగితే.. ఆలోచించకుండా రెండోవా స్టేట్మెంట్ ఇచ్చినవాడు అని సమాధానం చెప్తారు. కానీ నిజానికి రెండవ వాడు గొప్పవాడు కాదు. మొదటి వాడే గొప్పవాడు. ఎందుకంటే.. నువ్వు ధనవంతుడు అయితేనే కదా పది మందికి సహాయం చెయ్యగలవ్.. నీకు ఏమి లేకుండా నువ్వు అందరికి సహాయం చేసుకుంటూ వెళ్తే నష్టపోయేది నువ్వు కాదు.. నీ కుటుంబం. 


సహాయం చెయ్యాలి.. కానీ నువ్వు ధనవంతుడు అయినప్పుడు మాత్రమే.. ధనవంతుడు అంటే డబ్బు కాదు.. కుటుంబంలో వారికీ బాధ లేకుండా చూసుకున్నవాడే ధనవంతుడు అంటే.. ప్రజల మనసు కంటే ముందు నీ కుటుంబం మనసు గెలువు. వారి మనసు గెలిచావు అంటే వారి సహాయంతోనే ప్రజల మనసు గెలవగలవు. 


ఆలా కాదు అని.. డబ్బు లేకపోయినా నీకు నేను ఉన్న అని చెప్తే.. నీకు ఏ లేదు నాకు ఎం పెడుతావ్ రా ? అని ప్రశ్నిస్తారు సహాయం అడిగిన వారు. అందుకే.. నువ్వు సంపాదించు.. నీ కుటుంబం మనసు గెలువు.. ప్రజలకు తోడు ఉండు. అసలైన ధనవంతుడు కుటుంబం మనసు గెలిచిన వాడే..   


మరింత సమాచారం తెలుసుకోండి: