ఒకప్పుడు మనిషి ఆకులు తిని బ్రతికేవాడు.. పచ్చి మాంసం తిని కూడా ఎలాంటి అనారోగ్యాలు లేకుండా ఉన్నాడు. కాని ఇప్పుడు కడుపు నిండా భోజనం తింటున్నా సరే అంతా కల్తీ మయమై అనారోగ్య పాలవుతున్నాడు. మనిషి ఉదయం చేసే టిఫెన్ దగ్గర నుండి రాత్రి భోజనంలో తినే ఆహారం వరకు అన్ని కల్తీనే.   


ఈ కల్తీ ఆహారం తినడం వల్లే మనుషులు త్వరగా జబ్బున పడుతున్నారు. కల్తీ మందుల ప్రభావం వల్ల రోగ నిదోధక శక్తి తగ్గిపోతుంది. తద్వారా చిన్న రోగాలకు కూడా పెద్ద ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు జ్వరానికి టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయేది కాని ఇప్పుడు అదే జ్వరానికి రకరాకల పేర్లు పెట్టి హాస్పిటల్స్ బాగుపడుతున్నాయి.     


మనిషి అనారోగ్యా పాలవ్వడానికి అసలు కారణం కల్తీ ఆహారమే. ఆహార పదార్ధాల కల్తీ వల్లే అసలు సమస్యలు వచ్చేస్తున్నాయి. త్వరగా పంట చేతికి వచ్చేలా హైబ్రేడ్ విధానంలో పంటలను పండించడంతో వాటిని కల్తీ చేసి మార్కెట్ లోకి వదులుతున్నారు కొందరు. బియ్యంలో కూడా ఈమధ్య ప్లాస్టిక్ వచ్చిందని వార్తల్లో వచ్చిన విషయం తెలిసిందే.  


వంట నూనె కల్తీ చేయడంపై కూడా ఈమధ్య ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మనం తీసుకునే ఆహారం కల్తీ లేకుండా ఉంటేనే అనారోగ్య బారిన పడకుండా ఉంటాం. ఈ కల్తీ ఆహారం ఎంత చౌకగా వచ్చినా సరే అది తక్కువకు కొని హాస్పిటల్ కు వేల బిల్లులు కట్టాల్సి వస్తుంది. మరి ఈ కల్తీ విధానంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా తీవ్రమైన చర్యలు తీసుకుంటే తప్ప వీటి బారి నుండి ప్రజలు బయటపడే అవకాశం లేదు. తినే ఆహారం.. వేసుకునే మందులు.. ఇలా అన్ని రకాలుగా కల్తీ వ్యవస్థ ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. ఇది కచ్చితంగా మనవ మనుగడకు ఎంతో నష్టాన్ని కలిగిస్తుందని అందరు గుర్తించాలి. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: