సంతానలేమి... ప్రస్తుతం ఉన్న జీవనశైలిలో ఎంతో మంది దాంపత్య జీవితాన్ని కలచివేస్తున్న సమస్య. ప్రస్తుతం ఎంతోమంది సంతాన లేమితో బాధపడుతున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది వయసు పైబడిన తర్వాత పెళ్లి చేసుకోవడం కూడా సంతానలేమికి కారణమని  నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం జీవనశైలి ద్వారా వివిధ ఆరోగ్య సమస్యలు రావడంతో సంతానలేమికి కారణమవుతున్నాయని  చెబుతున్నారు అంతే కాకుండా తాజా సర్వేలో సంతానలేమికి గల కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సాధారణంగా కెమికల్ ఫ్యాక్టరీ,  బీడీ తయారీ కంపెనీలో పనిచేసే కార్మికులకు ఆరోగ్యంపై రసాయనాల  ఎఫెక్ట్ పడుతుందని తెలిసిన విషయమే. 

 

 

 అయితే ఈ రసాయనాల ప్రభావం శరీరం మీద పడటం వల్ల అంతర్గత హార్మోన్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా అవుతుందట. ఈ రసాయనాలు మగవారిలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తి పై ప్రభావాన్ని చూపడమే గాక  ఆడవాళ్ళు ఈస్ట్రోజెన్  హార్మోన్ల సంఖ్య పెరిగి పరిపక్వ అండాలు విడుదలవుతాయి. అయితే వీటన్నింటికీ కారణం కెమికల్ ఫ్యాక్టరీలో వెలువడే బిప్పినాల్ అనే  రసాయన వాయువు . వీటిని ఎక్కువగా పీల్చటం  వల్ల ఇంఫెర్టిలి  సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉందని... ఇది వారితోనే కాకుండా మూడు తరాల  వరకు కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కూడా చాలామందికి పిల్లలు కలగరని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇలాంటి కంపెనీలో పనిచేసే వారు ఎక్కువగా ఆంటీ ఆక్సిడెంట్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

 

 

 

 ఇలాంటి ఫ్యాక్టరీలో పనిచేసే వారికి సంతాన లేమి కలిపితే కనుక ఇది కూడా ఒక కారణమని భావించాలని తెలుపుతున్నారు నిపుణులు. అయితే ఇది కొందరి శరీర తత్వాన్ని బట్టి మాత్రమే వస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా కెమికల్ వల్లనే కాకుండా మిగతా ఆరోగ్య సమస్యల వల్ల కూడా సంతాన లేమి కలుగుతుందని చెబుతున్నారు. మొదట సమస్య ఏంటో గుర్తించిన తర్వాత దానికి పరిష్కార మార్గాలు వెతకాలి చెబుతున్నారు. సమస్య దేనివల్ల అని  తెలుసుకోకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని  సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: