దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ఉగ్రవాదం ఒకటైతే కల్తీ వ్యాపారం మరోటి. ఈ రెండు సమస్యలు ఎంతగా ప్రజల్ని పీడిస్తున్నాయంటే ప్రాణాలతో చెప్పలేనంతగా చెలగాట మాడుతున్నాయి. మనం తీసుకునే ప్రతి ఆహార పదార్ధాలను కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు కల్తీ గాళ్లూ.


ఎక్కడ చూడూ ప్రతి ఆహార పదార్ధాల్లోనూ కల్తీ రాజ్యమేలుతోంది. ప్రతి జిల్లాలో కల్తీ వ్యాపారం మూడు పువ్వులు... ఆరు కాయలుగా విలసిల్లుతోంది! ఆహార కల్తీ నియంత్రణ చట్టం స్థానంలో ఆహార భద్రత పరిశుభ్రత 2006 పేరుతో ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చినా ఫలితం లేకపోతోంది.


కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా ఈ చట్టం ద్వారా ఒకే విధానం అమల్లో ఉంటుంది. కఠిన సవరణలతో చట్టం వచ్చినా ఎక్కడా పూర్తిస్థాయిలో ఆచరణకు నోచడం లేదు. డబ్బులకు ఆశపడి కొందరు అధికారులు తమకేమి పట్టనట్లుగా వ్యహరిస్తున్నారు. ఇకపోతే వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో శాంపిల్స్ సేకరించింది. కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, కూరల నమూనాలను విశ్లేషించింది. ఆకులు, ఎర్ర కారం, బియ్యం, గోధుమ, పప్పుధాన్యాలు, పాలు, చేపలు, సీ ఫుడ్ , టీ, మాంసం, గుడ్లను పలు చోట్ల నుంచి సేకరించారు.


రిటైల్ అవుట్‌లెట్, ఎపిఎంసి మార్కెట్లు, మదర్ డెయిరీ, సేంద్రీయ అవుట్‌లేట్ల నుంచి నమూనాలు లెక్కగట్టారు. వీటిలో చాలా వరకు పురుగు మందుల అవేశేషాలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 27 గుర్తింపు పొందిన ఎన్‌ఏబీల్ ప్రయోగశాలల్లో వీటిని పరిక్షించారు. ఈ పరిశోధనలకు గాను శాస్త్రవేత్తలు 23వేల 660 నమూనాలు సేకరించి విశ్లేషించారు. 4వేల510 నమూనాల్లో పురుగు మందుల అవశేషాలు కనుక్కున్నారు. మనం రోజూ తినే ఆహారంలో 19.1 శాతం ఫుడ్‌లో పురుగు మందుల అవశేషాలున్నాయి.


ఇంకా ప్రమాదకరమేమంటే.. 523 నమూనాల్లో భారత ఆహార ప్రమాణాల సంస్థ నిర్దేశించిన దాని కంటే ఎక్కువుగా ఉన్నాయి. అంటే 2.2శాతం ఫుడ్ యమ డేంజర్ అన్న మాట. ఇలాంటి ఫుడ్ తింటున్న మనం నూరెళ్లూ బ్రతకాలంటే ఎక్కడ బ్రతుకుతాం. అందుకే రాను రాను మనిషికి అనారోగ్యాలు ఎక్కువవుతూ ఆయుష్షుని తగ్గిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే భావితరాల భవిష్యత్తు ఇంకా బలహీనంగా మారడం ఖాయమంటున్నారు ఆరోగ్యనిపుణులు.


మరింత సమాచారం తెలుసుకోండి: