హాలిడేస్ లో తన భార్య తో సంతోషం గా గడుపుదామని హోటల్ బుక్ చేసుకున్న ఒక భర్త కి షాక్ తగిలింది. ఇక వివరాల్లోకి వెళ్తే మార్క్ మౌల్డ్ అనే వ్యక్తి తన కుటుంబికులు, స్నేహితులతో కలిసి రెండు వారాలు ఈజిప్టులోని హుర్ఘదాలో గడిపేందుకు వెళ్లారు 3465 పౌండ్లు (రూ.3,20,648) వ్యయంతో టూర్ ప్యాకేజీ బుక్ చేశాడు. ఇందులో భాగంగా ట్రావెల్ ఏజెంట్ ద్వారా క్రిస్టల్ బీచ్ అక్వా పార్క్ అనే ఫైవ్ స్టార్ హోటల్‌ను బుక్ చేశాడు.


ఇక అక్కడికి వెళ్లిన తరువాత వాళ్లకి ఊహించని అనుభవం ఎదురైంది. విమానం దిగిన తరువాత నేరుగా హోటల్ అడ్రస్ కు వెళ్లగా ఆ ఫ్యామిలీని సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. ఆ హోటల్ నిర్మాణం ఇంకా పూర్తికాలేదని తెలిసి షాక్ అయ్యారు ఆ కుటుంబం. దీంతో ట్రావెల్ ఏజెంట్‌కు ఫోన్ చేసి చివాట్లు పెట్టారు. 
ఈ విషయమై మార్క్ సోషల్ మీడియా లో తన ఆవేదన వ్యక్తం చేసాడు. నిత్యం పనిలో బిజీగా ఉండే నేను రెండు వారాలు పిల్లలతో గడపాలని ఈ హాలీడే ప్లాన్ చేశాను. బీచ్‌కు సమీపంలో ఉన్న ఈ హోటల్‌లో వాటర్ పార్క్, ఆక్వా గేమ్స్ ఉంటాయని చెప్పారు.

దీంతో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని ఉద్దేశంతో బుక్ చేయాలని కోరాం. కానీ, మేము వచ్చేసరికి ఈ హోటల్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మేం గోల చేయడంతో ఆ హోటల్‌కు సంబంధించిన మరో చిన్న హోటల్‌లో ఓ గదిని కేటాయించారు. ఆ హోటల్‌లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో అది చాలా అపరిశుభ్రంగా ఉంది. విరిగిన సోఫాలు, కూలిన సీలింగ్స్‌తో భూతాల కొంపలో ఉన్న అనుభూతి కలిగింది. వారు ఇచ్చిన ఆహారం కూడా బాగోలేదు’’ అని తెలిపాడు. ఇక మొదట్లో రిఫండ్ కు నిరాకరించిన ట్రావెల్ ఏజెంట్ తరువాత కొంత సొమ్ము ను వెనక్కి ఇచ్చేసాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: