వైవాహిక జీవితంలో ఎంతో ప్ర‌ధాన‌మైన  శృంగారంపై మిక్కిలి జంట‌లు విముఖ‌త చూపుతున్నాయంట‌. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇదే ధోర‌ణి ఉన్నా..భార‌త్ విష‌యానికి వ‌చ్చేస‌రికి మాత్రం ఈ శాతం మ‌రింత ఎక్కువ‌గా ఉందంట‌. స‌ర్వేలో వెల్లడైన విష‌యాల‌ను గ‌మ‌నిస్తే విస్తుపోక త‌ప్ప‌దు. కేవలం 4 శాతం మంది జంట‌లు మాత్రమే రోజు సెక్స్ లో పాల్గొంటున్నాయ‌ట‌. ఇక ప్రస్తుత కాలంలో 10శాతం మంది మహిళలు..తమ భర్తలతో సంవత్సరంలో ఒక్కసారి కూడా  సెక్స్ లో పాల్గొనడం లేదట. 18శాతం మహిళలు సంవత్సరం, రెండు సంవత్సరాలకే త‌మ‌కు సెక్స్ లైఫ్‌పై బోర్ కొట్టేసిన‌ట్లు చెబుతున్నారంట‌.


ఈ క్ర‌మంలోనే భ‌ర్త‌కు స‌రైన సుఖం దొర‌క‌క సంస‌రాల్లోనూ పొర‌పొచ్చాల‌కు కార‌ణ‌మ‌వుతున్నార‌ట‌. అయితే 32శాతం మహిళలు మాత్రం సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా త‌మ‌కు సెక్స్ లైఫ్‌పై ఆస‌క్తి ఉంద‌ని చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. అయితే వాస్త‌వానికి ఎక్కువ‌గా మ‌హిళ‌లే సెక్స్‌పై విముఖ‌త‌గా ఉండటంతో భ‌ర్త‌లు శృంగారానికి దూరం కావాల్సి వ‌స్తోందంట‌. ఆధునిక స‌మాజంలో పెరిగిన ప‌ని ఒత్తిడి...మాన‌సిక ఒత్తిడి కూడా మ‌నుషులు శృంగారానికి దూరం ఉండ‌టానికి ప్ర‌ధాన‌మైన కార‌ణాల్లో ఒక‌టిగా నిపుణులు తేల్చేస్తున్నారు.


అదే స‌మ‌యంలో స‌రైన అవ‌గాహ‌న లేక‌పోవ‌డం..బిడియం..సిగ్గు..ఉండ‌టం..సెక్స్ అన‌గానే బూతు అన్న‌భావ‌న‌తో వ్య‌వ‌హ‌రించ‌డం లాంటివి శృంగారాన్ని ఆస్వాదించ‌కుండా చేస్తున్నాయ‌ని పేర్కొంటున్నారు. భార‌త్ విష‌యానికి వ‌చ్చే స‌రికి ఈ భావ‌న మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. శృంగారాన్ని ర‌హాస్యంగా భావిస్తారు. ముఖ్యంగా ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఈ ప‌రిణామం ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. మ‌హారాష్ట్ర‌, రాజ‌స్థాన్‌, ప‌శ్చిమ‌బెంగాల్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వాసులు శృంగారాన్ని ఎక్కువ‌గా ఆస్వాదిస్తార‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. పాశ్చ‌త్య దేశాల్లో  టీనేజ్ వ‌య‌స్సు నుంచే శృంగారంలో పాల్గొనే వారి సంఖ్య అధికంగా ఉంటుందంట. 


మరింత సమాచారం తెలుసుకోండి: