టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి , నాగార్జున కాంబో లో అట్టహాసంగా జరిగిన బిగ్ బాస్ -3  గ్రాండ్ ఫినాలే టీఆర్పీ రేటింగ్ లో దుమ్మురేపింది . యంగ్ టైగర్  జూనియర్ ఎన్టీఆర్ , నేచురల్ స్టార్ నాని లు వ్యాఖ్యాతలు వ్యవహరించిన బిగ్ బాస్ 1 , 2  ఫినాలే తో పోలిస్తే నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన సీజన్ 3 ఫినాలే టీఆర్పీ రేటింగ్ అధిగమించినట్లు తెలుస్తోంది .


 శ్రీముఖి , బాబాభాస్కర్ , వరుణ్ సందేశ్ , అలీ రెజా లతో గట్టి పోటీని ఎదుర్కొని రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెల్చుకున్న విషయం తెల్సిందే . నాలుగున్నర గంటలపాటు సాగిన బిగ్ బాస్ -3 ఫినాలే కార్యక్రమం 18 . 29 టీఆర్పీ రేటింగ్ సాధించినట్లు షో నిర్మాతలు వెల్లడించారు . దేశవ్యాప్తంగా అత్యధిక టీఆర్పీ రేటింగ్ నమోదు చేసిన షో ఇదేనని పేర్కొన్నారు . జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ -1 గ్రాండ్ ఫినాలే కు 14 .13 టీఆర్పీ రేటింగ్ సాధించగా, నాని వ్యాఖ్యాత వ్యవహరించిన గ్రాండ్ ఫినాలే కు 15 .05 టీఆర్పీ రేటింగ్ లభించినట్లు తెలిపారు .


 బిగ్ బాస్ సీజన్ -3  గ్రాండ్ ఫినాలే చివరి గంట ఏకంగా 22 .4 టీఆర్పీ రేటింగ్ సాధించినట్లు వెల్లడించారు . బిగ్ బాస్ సీజన్ 1 , 2 తో పోలిస్తే ఈ సీజన్ టీఆర్పీ రేటింగ్ కాసింత తగ్గిందన్న ప్రచారం జరిగినా , అందులో ఏమాత్రం నిజం లేదని షో నిర్మాతలు గణాంకాలతో సహా వెల్లడించడం పరిశీలిస్తే , షో నిర్వహణ లో సీనియర్ హీరో నాగార్జున సక్సెస్ అయినట్లేనని స్పష్టం అవుతోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: