పిల్లలకు చిన్నప్పటి నుండే తల్లిదండ్రులు మంచి అలవాట్లను నేర్పాలి. ఈ కాలంలో పిల్లలకు మనం మంచి అలవాట్లు అలవాటు చెయ్యకుండా మనకు ఉన్న అలవాట్లను వారికీ అలవాటు చేస్తున్నాం. చిన్నారులు పుస్తకలు చదవడం వల్ల వారికీ ఎంతో జ్ఞానం పెరుగుతుంది. కానీ ఈ కాలంలో పిల్లలకు పుస్తకాలు బదులు సెల్ ఫోన్లు అలవాటు చేస్తున్నాం. 


అయితే పిల్లలకు మంచి అలవాట్లు నేర్పాలి. పుస్తకాలు చదవడం నేర్పడం వల్ల వారు కొద్దీ కాలానికి ఎంతో ఇష్టంగా పుస్తకలు చదువుతారు. అప్పుడు వారు చదివే పుస్తకాలు కూడా వారికీ అంత కష్టంగా అనిపించవు. అయితే పిల్లలకు పుస్తకాలు ఎలా అవుతూ చెయ్యాలి ? ఎలా చదివించాలి అనేదానికి ఇక్కడ ఉన్న చిట్కాలు చదివి తెలుసుకోండి. 


పిల్లలకు చిన్న చిన్న కథలు చదివి వినిపిస్తుండాలి. బాల సాహిత్యానికి సంబంధించిన ఆసక్తికర పుస్తకాలను కూడా వారి చేత చదివించాలి. అప్పుడే పిల్లలు వారికీ తెలియకుండానే పుస్తకాలకు ఆకర్షితులవుతారు. 


పుస్తకాలు చదివి కొత్త కొత్త పదాలను నేర్చుకుంటారు. కొత్త విషయాల్ని తెలుసుకుంటారు. వాళ్లు పెద్దయ్యే కొద్దీ పుస్తకాలు వారికిచ్చి చదివించడం అలవాటు చేయాలి. 


పిల్లల వయసుకు తగ్గ పుస్తకాలనే వారి చేత చదివించాలి. అలా కాకుండా ఏదో ఒక పుస్తకం ఇచ్చి చదవమంటే పుస్తక పఠనం పట్ల వాళ్లకి ఆసక్తి నశించే ప్రమాదం ఉంది. 


పిల్లల్ని తల్లిదండ్రులు తరచూ లైబ్రరీకి తీసికెళుతుండాలి. అలా చేయడం వల్ల పిల్లల్లో పుస్తకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 


పిల్లల చేత పుస్తకాలను చదివించడంలో తల్లిదండ్రులు ఎంతో యాక్టివ్‌గా వ్యవహరించాలి. 


పుస్తకాలను చదువుకోవడానికి పిల్లలకు ఇంట్లో మంచి వాతావరణాన్ని, స్పేస్‌ను తల్లిదండ్రులు కల్పించాలి. అప్పుడే వారు పుస్తక ప్రేమికులు అవుతారు. 


అంతే కాదు పిల్లలకు మొబైల్స్ , ఐపాడ్స్ ఇవ్వకుండా వారి వయసుకు తగ్గట్టు కామిక్స్‌, మేగజైన్స్‌, న్యూస్‌పేపర్స్‌లను పిల్లలకు అందుబాటులో ఉంచాలి. 


చిన్నపిల్లలు అయితే ఎక్కువగా బొమ్మలు ఉండే పుస్తకాలను పిల్లలకు ఇవ్వటం మంచిది. అంతేకాదు అప్పుడప్పుడు పిల్లలకు పుస్తకం చదివి కథలు వినిపించడం ద్వారా పిల్లలకు, తల్లిదండ్రులకు మంచి బంధం ఏర్పడుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: