ఇటీవల కాలంలో బర్గర్లు, పిజ్జాలు వంటి ఆహారాలు ఎక్కువ మంది తినడం వల్ల అనారోగ్యాల బారిన పడే అవకాశం ఏర్పడుతోంది. పోషకాలు నిండిన ఆహారాలు తీసుకోకపోవడం వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయని మీకు తెలుసా? మీ శృంగార జీవనం బాగా సాగేందుకు ఐదు ఆహార పదార్థాలను తీసుకోవడం మర్చిపోవద్దు. 


ఉల్లిపాయలు: ఉల్లిపాయలు అవయవాలను బలోపేతం చేస్తుంది. టెస్టోస్టెరాన్ పెంచుతుంది. ఉల్లిపాయ అనేది పురుషులు, మహిళలు ఇద్దరిలో లిబిడోను పెంచుతుంది. ఆయుర్వేదంలో దీనిని లైంగిక శక్తిని పెంపొందించే ఒక టానిక్ లాగా పిలుస్తారు. ఉల్లిపాయలు ఎక్కువగా తినడంతో వీర్య శాతాన్ని పెంచుకోవచ్చు అని నిపుణులు తెలుపు తున్నారు. 


వెల్లుల్లి : వెల్లుల్లి అల్లిసిన్ ఉంటుంది. ఇది శరీరంలో వేడిని పెంచుతుంది. టెస్టోస్టెరాన్ ను అధికంగా పెంచే గుణం వెల్లుల్లిలో ఉంటుంది. వెల్లుల్లి లైంగిక దృఢత్వానికి చాలాబాగా ఉపయోగపడుతుంది. బాడీ బిల్డర్లు దీనిని కండరాల పెరుగుదలకు ఉపయోగించడం జరుగుతుంది. 


మిరియాలు: మిరియాలు అనేవి మీ లైంగిక జీవితానికి మసాలాగా సహాయపడుతాయి. వేడి మిరియాలు క్యాప్సైసిన్ కలిగి ఉండటం వల్ల ఇది శరీరంలో వేడిని సృష్టిస్తుంది. అంగస్తంభన కోసం రక్తప్రసరణ, రక్త ప్రవాహాన్ని మిరియాల పొడి మెరుగు పరుస్తుంది. మిరియాలు తక్షణ ప్రభావాన్ని చూపిస్తాయి. 


ఖర్జూరాలు( డేట్స్ )  : ఖర్జూరపు పండులో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అవి లైంగిక శక్తిని కూడా పెంచుతాయి. పడక గదిలో ఇవి ఉండటం చాలా మంచిది.

చేపలు: చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. చేపలు మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. అంగస్తంభన సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగించే అమైనో ఆమ్లం ఎల్-అర్జినిన్ వంటివి కూడా చేపలలో పుష్కలంగా ఉంటాయి. దీనిని సహజ వయాగ్రా అని కూడా పిలుస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: