ఈరోజుల్లో సాధారణ ఉద్యోగం ఉన్న యువకులు భారీగా కట్నం డిమాండ్ చేస్తున్న ఈ రోజుల్లో ఓ జవాన్ ఏకంగా రూ 11 లక్షల కట్నం వద్దని అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక బదులుగా 11 రూపాయలు మరియు ఒక కొబ్బరికాయను మాత్రమే కట్నంగా స్వీకరించాడు.


రాజస్థాన్‌లోని జైపూర్‌కి చెందిన జితేందర్‌ సీఐఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 8న ఆయన వివాహం జరిగింది. పెళ్లి సమయంలో అమ్మాయి తండ్రి కట్నం కింద రూ. 11 లక్షలు నగదు పళ్లెంలో పెట్టి ఇవ్వబోయాడు. జితేందర్‌ ఆ మొత్తాన్ని వద్దని కేవలం రూ.11, కొబ్బరికాయను కట్నంగా స్వీకరించాడు. 


కట్నం అనే పెనుభూతానికి వ్యతిరేకంగా ఒక ఉదాహరణగా, ఈ జవాన్   జితేంద్ర సింగ్ వివాహంలో తనకు ఇచ్చే నగదును తిరస్కరించాడు మొదట్లో కట్నం వద్దని చెప్పలేదు, తీరా పెళ్లి సమయంలో చెప్పడం తో . ప్రారంభంలో, వధువు తల్లిదండ్రులు బరాటీలు (వివాహ అతిథులు) ఏర్పాట్ల పట్ల అసంతృప్తిగా ఉన్నారని భావించారు, అయితే వరుడి పెద్ద మనసుని చూసిన ప్రతి ఒక్కరూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. జితేంద్ర వధువు చంచల్ షెకావత్ ను వివాహం చేసుకున్నాడు. తాను పెళ్లి చేసుకున్న అమ్మాయి రాజస్థాన్‌ జుడీషియల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు సిద్ధమవుతోందని, అమె మేజిస్ట్రేట్‌ అయితే అదే తనకు పెద్ద కట్నం అని చెప్పాడు. జితేందర్‌ భార్య న్యాయశాస్త్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌. ప్రస్తుతం ఆమె పీహెచ్‌డీ చేస్తోంది.


వధువు తండ్రి గోవింద్‌ సింగ్ మాట్లాడుతూ ‘‘మా అల్లుడు కట్నం వద్దనడంతో మొదట నేను షాకయ్యాను. పెళ్లికి చేసిన ఏర్పాట్లు నచ్చక కట్నం వద్దంటున్నారని అనుకున్నా. కానీ తర్వాత కట్నం వద్దనటానికి గల కారణం తెలిసి చాలా సంతోషపడ్దా’’ అని తెలిపారు. కట్నం వద్దు అని అందరికీ ఆదర్శం గా నిలిచినా జవాన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: