ఛార్జ్ అవుతున్న ఫోన్స్ లో కాల్స్ మాట్లాడడం. . ఆ సమయంలో అవి పేలి పోవడం.. ఆ తర్వాత ఆ కాల్స్ మాట్లాడేవాళ్ళు చనిపోవడం.. మనం చూసాం. ఛార్జ్ అవుతున్న ఫోన్స్ లో గేమ్స్ ఆడటం... ఆ సమయంలో అవి పేలి పోవడం...ఆ గేమ్స్ ఆడేవాళ్లు చనిపోవడం మనం చూసాం.... కానీ ఛార్జ్ అవుతున్న ఫోన్ లో ఫుట్ బాల్ మ్యాచ్ చూడడం...  ఫోన్ పేలకపోయిన.. ఆ ఫుట్ బాల్ చూసే వ్యక్తి చనిపోవడం... మనం ఇంతకు ముందు ఎప్పుడూ చూడాలే వినలే.


వివరాల్లోకి వెళితే.... సొమ్చీ సింగిఖార్న్ (40) థాయిలాండ్ లోని ఒక హోటల్లో చెఫ్ గా పనిచేస్తున్నాడు. మంగళవారం రోజు.. రాత్రి వరకు పనిచేసిన సొమ్చీ సింగిఖార్న్ తన డ్యూటీ అయిపోవడంతో హోటల్ లోనే ఉన్న ఒక విశ్రాంతి గదిలోకి వెళ్ళాడు. ఆపై ఇయర్ ఫోన్స్ పెట్టుకొని తన మొబైల్ లో ఫుట్ బాల్ మ్యాచ్ చూడడం ప్రారంభించాడు. అదే గదిలో ఉన్న సొమ్చీ సహా ఉద్యోగి రూమ్ మెట్ అయినా సేన్గ్(28) అతను ఏం చూస్తున్నాడో అని ఒకసారి చూసి ఆ తర్వాత నిద్రపోయాడు. తెల్లారింది.. సొమ్చీ ఫ్రెండ్ లేచాడు కానీ సొమ్చీ అలాగే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కళ్ళు తెరిచి ఉన్నాడు. ఫ్రెండ్ కి డౌట్ వచ్చింది.. దగ్గర వెళ్లి చూసాడు.. అప్పుడు సొమ్చీ విగతజీవిగా కనిపించాడు.

దీంతో షాకైన అతడి స్నేహితుడు హోటల్ ఓనర్ కి చెప్పాడు. ఏం జరిగిందో అర్థంకాని ఆ హోటల్ యజమాని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సొమ్చీ శవాన్ని పరిశీలించారు. అప్పుడు వారికి అతని మెడపై కాలిన గాయాలు కనిపించాయి. ఇంకా... గమనించిన వారికి సొమ్చీ చెవిలో ఉన్న ఇయర్ ఫోన్స్ కనిపించాయి. ఏమి అర్ధం కానీ పోలీసులు పక్కకు చూసారు... అప్పుడు వారికి ఒక ఛార్జ్ అవుతున్న ఫోన్ కనిపించింది. ఆ ఫోన్ కు సొమ్చీ చెవిలో ఉన్న ఇయర్ ఫోన్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. దీంతో పోలీసులకు సొమ్చీ ఎలా చనిపోయాడో అర్ధం అయింది. వారు ఇలా చెప్పారు." అతడి వంటి మీద ఉన్న కాలిన గాయాలను బట్టి.. ఇయర్ ఫోన్స్ నుంచి విద్యుత్ ప్రవహించడం వల్ల అతడు చనిపోయాడు." 


చూసారా! ఛార్జింగ్ అవుతున్నప్పుడే మొబైల్‌లో సినిమాలు, వీడియోలు, బ్రౌజింగ్ చేయడం ఎంత ప్రమాదకరమో..


మరింత సమాచారం తెలుసుకోండి: