సాధారణంగా కొన్నేళ్ల క్రితం మనిషి ఎక్కువగా బాహ్య సౌందర్యంతో పాటు అంతః సౌందర్యానికి కూడా ప్రాధాన్యత నిచ్చేవాడు. అయితే అది రాను రాను పూర్తిగా మారిపోయి ప్రస్తుతం మనలో ఎక్కువమంది కేవలం బాహ్య సౌందర్యానికి తప్ప అంతః సౌందర్యానికి విలువనిచ్చేవారు తక్కువగా ఉంటున్నారు. ఇక యువతీ యువకులు ఎక్కువగా ఒక్కసారి చూసి చూడగానే కలిగే తాత్కాలిక ఆకర్షణకు లోనవుతూ, దానినే ప్రేమగా భావించడం, ఒకవేళ తాము ఇష్టపడిన వ్యక్తి దక్కకపోతే చివరకు ఎంతకైనా తెగించడం వంటివి చేస్తున్నారు. ఇక మరీ ముఖ్యంగా కుర్రాళ్లలో ఎక్కువమంది ఎవరైనా ఒక అమ్మాయి నచ్చితే చాలు, ఎలాగైనా ఆ తరువాత ఏమి చేసైనా సరే ఆ అమ్మాయిని దక్కించుకోవాలని సర్వరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కొందరు మానసిక నిపుణలు చెప్తున్న దానిని బట్టి చూస్తే, నిజంగా ఒక అమ్మాయిని, అలానే ఆమె మనసుని గెలిచి, ఆమె మనల్ని ఆకర్షించేలా చేసుకోవడానికి పెద్దగా శ్రమ పడవలసిన అవసరం లేదని వారు అంటున్నారు. 

ఇక వారు చెప్తున్న ప్రకారం, ముందుగా మనం ఇష్టపడే అమ్మాయి ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలట, తదనుగుణంగా ఆమె ఇష్టాలకు తగినట్లు మనలో ఎటువంటి క్వాలిటీస్ ఉన్నాయి అనేది చెక్ చేసుకుని, ఒకవేళ ఆమె భావిస్తున్న విధంగా మనలో అటువంటి క్వాలిటీస్ లేకపోతే, అందుకోసం మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం చేయాలట. క్వాలిటీస్ అంటే తప్పుడు విషయాలు కాదు సుమండీ. ఇక దానితో పాటు, అసలు మనం ఆ అమ్మాయిని ఇష్టపడడానికి మనలో ఉన్న క్వాలిటీస్, అర్హతలు ఏమిటో చెక్ చేసుకోవాలట. అంటే డబ్బు, హోదా విషయాలు ప్రక్కన పెడితే, సంఘంలో మనకంటూ ఒక మంచి విద్య లేదా ఉద్యోగం వంటివి ఉంటె మంచిదని అంటున్నారు. ఇక అప్పటికే మనకు కొన్ని దురలవాట్లు కనుక ఉంటె, వాటిని ఇకపై దరిచేరనీయకుండా మానివేస్తే బెటర్ అట. ఇక మరీ ముఖ్యంగా మనం కోరుకున్న అమ్మాయితో మనకు ఒక చిన్న రిలేషన్ అనేది ఏర్పడిన తరువాత, ఎక్కువగా అంతా నిజాయితీగా వ్యవహరించడం, అలానే ఏవైనా మనం తెలిసి చేసిన, తెలియక చేసిన తప్పులుంటే నిజాయితీగా ఆమె ముందు ఒప్పుకోవడం, 

మరియు ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా నిజం చెప్పడం వంటివి అలవర్చుకోవాలట. అప్పుడే ఆ అమ్మాయికి మన మీద నమ్మకం అనేది ఏర్పడుతుందని అంటున్నారు. ఒక బంధానికి నిజమైన పునాది నమ్మకం అనేది మనం ఎప్పటికీ మరువకూడదని అంటున్నారు. ఇక మహాత్మాగాంధీ దగ్గరినుండి ఎందరో మహానుభావులు చెప్పినట్లు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధమైన నిజాన్ని, మన అని అనుకున్న వాళ్ళ దగ్గర చెప్పడం వలన, వారి సాంగత్యం ఎల్లప్పుడూ తప్పకుండా మనతోనే ఉంటుందని చెప్తున్నారు. వాటితో పాటు మెల్లగా పరిచయాలు పెరిగాక, ఆమెలో ఉన్న మీకు నచ్చని అంశాలు ఉంటె కూడా తప్పకుండా చెప్పాలట, అప్పుడే ఆమెకు మన మనసు మరియు అభిరుచులు తేలుస్తాయట. అలానే ఎక్కువగా అమ్మాయితో మాట్లాడేటపుడు ఎంతో సరదాగా, చలాకీగా మాట్లాడితే  బాగుంటుందని, ఎందుకంటే ఎక్కువగా అమ్మాయిలు సరదాగా కలుపుగోలుగా ఉండే అబ్బాయిలని ఇష్టపడుతుంటారని చెప్తున్నారు. ఇక మొత్తంగా వీటన్నిటిని బట్టి వారు చెప్పేది ఏమిటంటే, వాస్తవానికి ఒక అమ్మాయిని ఎక్కువగా ఆకర్షించేది అబ్బాయిలో ఉండే స్వచ్ఛమైన మనసు, నిజాయితీ, అలానే చలాకీతనం అని, అలా మగవాడు మెలిగినపుడు, ఒక అమ్మాయికి తన జీవితాన్ని భవిష్యత్తులో అతడు ఎంతో సంతోషంగా ముందుకు నడిపించగలడు అనే నమ్మకం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: