ప్రస్తుత సమాజంంలో చాలా మంది ఆడవారు తమ భర్తలు వేరొకరి వైపు చూస్తారేమో అని భయపడతారు. ఈ ఆలోచనే వారి సందేహానికి మొదటి మెట్టు వంటిది. ఇలాంటి సందేహాలు ఏవైనా ఉంటే వాటిని ప్రారంభంలోనే పటాపంచలు చేసుకోవాలి. లేకపోతే ఇలాంటివి ఒక పోరాటంగా ప్రారంభమై చివరికి వారి భాగస్వాములతో శాశ్వతంగా దూరమయ్యేందుకు దారి తీస్తుంది.ఇప్పటికే సందేహాల పేరుతో చాలా జంటలు ఇప్పటికే విడాకులు తీసుకున్న ఎన్నో వార్తలను మనం నిత్యం ఎన్నో చూస్తున్నాం.ఈ సందర్భంగా ఈ రోజు స్టోరీలో జీవిత భాగస్వామితో ఎలా వ్యవహరించాలో తెలుసుకుందాం.


మీరు మీ జీవిత భాగస్వామిని ఎంతగా ప్రేమిస్తున్నారో మీలో మీరు మాత్రమే ఉంచుకుంటే, అందులో అర్థమనేదే ఉండదు. మీరు ఎప్పుడు అయితే మీ జీవిత భాగస్వామిని ఎంతగా ప్రేమిస్తున్నారో ధైర్యంగా, వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఈ ప్రేమను క్రమంగా వారికి తెలియజేయటం వల్ల వారు ప్రేమను నిజంగా పొందినట్లు భావిస్తే మీ ఇద్దరి మధ్య అనుమానం అనే పెనుభూతం ఆమడ దూరం పారిపోతుంది. మీ జీవిత భాగస్వామి వేరొక మహిళతో కనిపిస్తే మీరు వెంటనే అనుమానించొద్దు. అలాగే మీ మనసులో ఏమైతే అనుకుంటున్నారో వాటిని కంట్రోల్ చేసుకోండి. అలాంటి ప్రశ్నలను మళ్లించడానికి ప్రయత్నించండి. మీ భార్య రూపం పూర్తిగా ఆకట్టుకుందని చెప్పండి. మీరు మీ మనసులో ఎలా అనుకున్న బయటికి మాత్రం ఇదే చెప్పండి.


కొంతమంది మగవారు తమ జీవిత భాగస్వాములు అమాయకులు అనుకుంటారు. కానీ ఆడవారు అన్నాక ఏదో ఒక సందర్భంలో చీటికి మాటికి, అయినదానికి, కానిదానికి ఊరికే అరుస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మీరు మెల్లగా జారుకోండి. మీ జీవిత భాగస్వాములు ఏదైనా విషయంలో మీపై చిన్న అనుమానం వచ్చినా అరవడం ప్రారంభిస్తారు. అందుకే వారితో వాదులాటను పెంచుకునే బదులు, వారి కోపం తగ్గేవరకు, వారికి కనిపించకుండా ఆ స్థలాన్ని విడిచిపెట్టి కాసేపు ఎక్కడికైనా వెళ్లండి.


మీ లేడీ ఫ్రెండ్స్ ను మీ జీవిత భాగస్వామికి పరిచయం చేయండి. ఇలా చేయడం వల్ల మీ జీవిత భాగస్వామితో మీ రిలేషన్ షిప్ లో కొన్ని ఇబ్బందులు అనేవి రావచ్చు. కానీ ఇలా చేయడం మాత్రం చాలా చాలా అవసరం. ఎందుకంటే తర్వాత మీరు లేడీ ఫ్రెండ్స్ తో ఏదైనా సందర్భంలో మాట్లాడాల్సి వస్తే అప్పుడు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని చూసి అస్యహించుకోవడం లేదా గొడవపడే అవకాశం ఉంటుంది. అందుకే ముందే వారికి పరి చేయం చేస్తే వారి మధ్య స్నేహం పెరిగే అవకాశం ఉంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: