గ్రహాంతరవాసుల గురించి తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటారు. గ్రహాంతరవాసుల గురించి వచ్చిన ఏ ఫోటో అయినా ఏ కథ అయినా అది ఇంటర్నెట్లో ఒక పెద్ద సంచలనమే అవుతుంది. కేవలం ఫోటోలు కథలే కాదు.. ఏలియన్స్ పైన వచ్చిన సినిమాలు కూడా బాగా హిట్ అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే ప్రజలకు గ్రహాంతరవాసులు పైన ఎంత ఆసక్తిని చూపుతున్నారో తెలుసుకోవచ్చు. కేవలం సాధారణ వ్యక్తులే కాదు బాగా చదివిన శాస్త్రవేత్తలు కూడా గ్రహాంతర వాసులు యు ఎఫ్ ఓ లేదా ఎగిరే పళ్ళాలు పై భూమి మీదకు వస్తా రని నమ్ముతారు. 


మొన్న ఈ మధ్య వరంగల్ కు చెందిన ఒక వ్యక్తి తాను గ్రహాంతరవాసిని చూశానంటూ ఒక వీడియో తీసి అది ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేస్తే అది బాగా చక్కర్లు కొట్టింది. మరొక వీడియోలో కొందరు రెండు తెల్లటి జీవులను తీస్తూ అవి గ్రహాంతరవాసులు అంటూ ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేశారు. దీంతో ఆ వీడియో చాలా వైరల్ అయింది. 
అయితే తాజాగా ఒక అమెరికాకు చెందిన వ్యక్తి డేనియల్ హాలండ్, ఈ వీడియోని ట్విట్టర్ లో అప్లోడ్ చేసి ఇవి గ్రహాంతరవాసులు కావు. కేవలం రెండు గుడ్ల గూబ పిల్లలు అని చెప్పాడు. దీంతో అప్పటివరకు వాటిని ఏలియన్స్ అనుకున్న వాళ్లంతా అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియోని 80 లక్షల మంది చూశారు. మూడు లక్షల 60 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. అది కూడా కేవలం ఒక రోజు వ్యవధిలో మాత్రమే. 


ఈ వీడియోని 2017 లో విశాఖపట్నం నివాసులు తీశారు. ఈ తెల్లటి గుడ్లగూబలు ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో వీళ్ళకి కనిపించాయి. వీరు వీడియో తీస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఈ గుడ్లగూబలు నిల్చొని బిక్కుబిక్కుమంటూ చూశాయి. దీంతో ఇవి గ్రహాంతరవాసుల మాదిరే వీడియోలో కనిపించి నెట్టింట వైరల్ అయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: