నిక్ జోనస్ కు హాలీవుడ్ లోబీభత్సమైన ట్రాక్ రికార్డ్ ఉంది. ఈయన ఎంత గొప్పగా పాటలు పాడతాడో.. అంతే ఈజీగా గర్ల్ ఫ్రెండ్స్ ని మార్చేస్తాడని టాక్ ఉంది. అలాంటి ప్రే బాయ్ ని పూర్తిగా కంట్రోల్ లోకి తీసుకుంది పీసీ. 


ప్రియాంకా చోప్రా అదృష్టవంతురాలని తెగ పొగిడేస్తోంది బాలీవుడ్. చెప్పిన మాట వినే భర్త దొరికాడని చాలా మంది బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు కూడా కుళ్లుకుంటున్నారు. ఇంతకీ ప్రియాంక లక్ గురించి ఇంత సడెన్ గా ఎందుకు మాట్లాడుకుంటున్నారు.. అంటే ఈ జంట కొనుక్కున్న ఇల్లే కారణం. 


ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్ దంపతులు రీసెంట్ గా లాస్ ఏంజెల్స్ లో ఎన్సినో అనే ఏరియాలో పెద్ద ఇల్లు కొనుక్కున్నారు. ఏడు బెడ్ రూమ్ లు, పెద్ద ప్లే గ్రౌండ్ తో ఉన్న ఇంటిని 144కోట్లతో సొంతం చేసుకున్నారు. ఈ ఏరియాలో ఇంత మొత్తం ఖర్చు చేసి కొనుక్కున్న పెద్ద ఇల్లు ఇదే అని అక్కడి రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. నిక్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియాంకా చోప్రా పెట్టిన కండీషన్ కొత్త ఇల్లు కొనడం. అప్పుడే పిల్లల గురించి ఆలోచిద్దాం అని చెప్పింది. అంతే నిక్ తన బ్యాచిలర్ ఇంటిని అమ్మేసి ప్రియాంక కోసం భారీ భవంతిని కొన్నాడు. ఇలా పీసీ చెప్పిందో లేదో.. ఆమె భర్త ఇల్లు కొన్నాడని ఇక్కడి బాలీవుడ్ భామలు తెగ బాధపడిపోతున్నారు. ఆమె భర్తని ఎలా కంట్రోల్ లో పెట్టిందని ఆరాలు తీస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: