షుగర్ వ్యాధి రోజురోజుకీ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. షుగర్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రస్తుతం ప్రజల జీవనశైలి వల్లే షుగర్ వ్యాధి బారిన పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ షుగర్ వ్యాధి పెద్దల్లో నే కాదు చిన్న పిల్లలల్లో  కూడా ఎక్కువగా కనిపిస్తుంది. రోజు రోజుకు చిన్న పిల్లలు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ వ్యాధిపై  తల్లిదండ్రులకు సరైన అవగాహన లేకపోవడంతో తమ తమ పిల్లలు దీన్ని గుర్తించడం లేదు. దీంతో రోజురోజుకు తమ పిల్లల్లో  షుగర్ వ్యాధి ముదిరిపోతుంది. దేశంలో రోజురోజుకు షుగర్ వ్యాధి పెరిగిపోతున్న నేపథ్యంలో... చిన్న పిల్లలకు షుగర్ వ్యాధి రాదేమో  అనుకొని తల్లిదండ్రులు అంతగా పట్టించుకోరు. రోజురోజుకు చిన్నపిల్లల్లో కూడా షుగర్ వ్యాధి వ్యాప్తి పెరిగిపోతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ మహమ్మారి వ్యాధి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఒకవేళ  మీ పిల్లలు షుగర్ వ్యాధి వస్తుందా లేదా అన్న విషయం తెలియాలంటే... మీ పిల్లల్లో  ఈ లక్షణాలు ఉన్నాయా లేవా అని ఒకసారి గమనించండి. 

 

 

 

 చాలా మంది చిన్నారులు అంత త్వరగా డయాబెటిస్ లక్షణాలు కనిపించవు. అయితే అప్పటి వరకు బాగా హెల్దీగా ఉన్న మీ పిల్లలు ఒక్కసారిగా బరువు తగ్గిపోవటం జరిగితే  అది షుగర్ వ్యాధికి ఒక ఒక లక్షణం అనే గుర్తించాలి. అంతేకాకుండా షుగర్ వ్యాధి ఉన్నవారు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటారు. అలాగే  మీ పిల్లలు కూడా మోతాదు కంటే ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటే ఒకసారి గమనించాల్సిందే . షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు  అధిక మూత్ర విసర్జనతో బాధపడుతుంటారు. మీ పిల్లలు కూడా ఇలాంటి సమస్య ఉందా లేదా అన్నది గమనించాలి. కొన్ని కొన్ని సార్లు చిన్నారులకు స్పర్శ ఉండదు కాళ్లకు కానీ  చేతులకి కానీ ఏదైనా దెబ్బలు తాకినప్పుడు స్పర్శ ఉండకుండా ఉంటే... దీనిని తేలికగా తీసుకోకుండా జాగ్రత్త పడటం మేలు . ఇక మరో లక్షణం ఏంటంటే కళ్లు కనిపించకపోవడం... చిన్నారులు ఎక్కువగా కళ్ళు కనిపించడం లేదు అంటూ తరుచూ చెబుతుంటారు ఒకవేళ ఇలాంటి లక్షణం మీ పిల్లల్లో  ఉంటే సంప్రదించాల్సిందే. 

 

 

 

 అయితే షుగర్ వ్యాధి  ఉన్న చిన్నారులు అందరిలో ఇలాంటి లక్షణాలు కనిపించాలని ఏమీ లేదు. కొంతమందికి ఇలాంటి లక్షణాలు కనిపించకుండానె  షుగర్ వ్యాధి వస్తుంటుంది. తల్లిదండ్రులు సకాలంలో గుర్తించి నిపుణుల సలహాలు తీసుకుంటేనే మంచిది. సకాలంలో గుర్తించక పోతే ఈ వ్యాధి రోజురోజుకీ పెరిగిపోతున్నది . దేశంలో రోజురోజుకీ చిన్నారుల్లో షుగర్ వ్యాధి ఎక్కువవుతున్న తరుణంలో... వ్యాది వ్యాప్తి  చెందుతున్న మొదట్లోనే దీనికి చికిత్స అందించడం ద్వారా నయం చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు . సాధారణంగా అయితే పెద్దల వలె కాకుండా పిల్లలకు టైప్ 1 డయాబెటిస్ వస్తూ ఉంటుంది. దీనికి కారణం రోజురోజుకు పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్యం... జన్యుపరమైన లోపం. అయితే తల్లిదండ్రుల నుంచి కూడా పిల్లలకు కొంతమేర డయాబెటీస్ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం. పిల్లలో  ఈ వ్యాధి  నివారించేందుకు ఎక్కువగా అవుట్డోర్ గేమ్స్ ఆడించడం.. తినే ఆహారంలో కూడా డైట్  పాటించటం.. రోజు కొంత వ్యాయామం   చేయించడం ద్వారా కొంత మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: