ఎమ్యెల్యే లు ఒకరి పై మరొకరు విమర్శలు చేసుకునే వాళ్ళనే ఇప్పటి వరకు చూసాం. కానీ ఈ ఎమ్మెల్యేలు కాస్త డిఫరెంట్ ఎందుకంటే వీరిద్దరూ ప్రేమ లో పడ్డారు అవునండి ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. డాక్టర్లు డాక్టర్లను, లాయర్లు లాయర్లను, కలెక్టర్లు కలెక్టర్లను, యాక్టర్లు యాక్టర్లను వివాహం చేసుకోవడం ఇప్పటివరకు చూశాం. కానీ ఎమ్మెల్యే  మరో ఎమ్మెల్యేని వివాహం చేసుకోవడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. 


ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అదితి సింగ్‌తో పంజాబ్‌లోని షహీద్‌ భగత్‌సింగ్‌ నగర్‌ ఎమ్మెల్యే అంగద్‌ సింగ్‌ షైని వివాహం నవంబర్‌ 21న ఢిల్లీలో జరుగనుంది. ఈ యువ జంట ఎప్పటి నుంచో ప్రేమ లో ఉన్నట్లు తెలుస్తోంది రాష్ట్రాలు వేరు అయిన వీరి ప్రయాణం మాత్రం ఒక్కటే. వీరిద్దరూ ప్రముఖ రాజకీయ కుటుంబాలకు చెందిన వారు కాగా, ఒకే ఏడాది ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం విశేషం.


అధితి ఒక ఆంగ్ల పత్రిక కు తమ పెళ్లి గురించి చెప్తూ "మేమిద్దరం ఎమ్మెల్యేలు కాబట్టి, మా ప్రధాన బాధ్యత మా నియోజకవర్గం మరియు ప్రజలు అని మాకు తెలుసు. నేను ఈ రోజు ఎంత ఎక్కువ సమయాన్ని ఇస్తున్నానో అంతే సమయాన్ని పెళ్లి తరువాత కూడ వీలు అయినంత సమయాన్ని కేటాయిస్తాను, ఇది కాకుండా నేను మరియు అంగద్ కూడా ఒకరికొకరు నియోజకవర్గాల ప్రజలతో సంభాషించడానికి ప్రయత్నిస్తాము." అని చెప్పారు


వీరి పెళ్లి ఆహ్వానాలను ఇప్పటికే అతిధులకు, రాజకీయ ప్రముఖులకు అందించారు. అదితి తండ్రి అఖిలేష్‌ కుమార్‌ సింగ్‌ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవగా, అంగద్‌ సింగ్‌ షైనీ తండ్రి దిల్‌బాగ్‌ సింగ్‌ నవాన్‌షహర్‌ అసెంబ్లీ స్థానం నుంచి రికార్డు స్థాయిలో ఆరు సార్లు ఎన్నికయ్యారు. అంగద్‌ సింగ్‌ షైనీ పంజాబ్ అసెంబ్లీ లో మిగతా ఎమ్మెల్యేల కంటే వయసులో చిన్నవాడు. ఇక అదితి సింగ్‌ కూడా ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో వయసులో అందరి కంటే చిన్న ఎమ్మెల్యే. వీరి వివాహం నవంబర్‌ 21న ఢిల్లీలో జరుగనుండగా, రిసెప్షన్‌ నవంబర్‌ 23న నిర్వహించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: