అయ్యయ్యో ఎంత పని అయింది. ఒక పెళ్లి లో సరదాగా ఆడుకునే ఆట ఆ భార్య ప్రాణం మీదకి తెచ్చింది. పెళ్ళిళ్ళల్లో సరదా ఆటలు ఆడుకోవడం సాధారణమే. అయితే ఈ సాధారణ ఆటల్లో కిక్ ఏం ఉంటుంది అని ఈ ఆటని కొంచెం వినూత్నంగా మార్చి.. భార్య భర్తల మధ్య పోటీ పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచించారు ఆ పెళ్లి వేడుక  నిర్వాహకులు ఇక ఈ  ఆలోచనకు ఆ పెళ్లి వేడుక రెడీ అయింది. 
మ్యూజికల్‌ చైర్‌ కాంపిటేషన్‌ అందరికీ గుర్తుండే ఉంటుంది. పాఠశాల రోజుల్లో ఈ ఆట ఆడని వారెవ్వరూ ఉండరు. ఈ ఆటని కొంచెం వినూత్నంగా మార్చి.. భార్య భర్తల మధ్య పోటీ పెడితే ఎలా ఉంటుంది. సరిగ్గా అలాంటి ఆలోచనకు ఓ పెళ్లి వేడుక వేదికైంది. గేమ్‌ ఎంటంటే.. కుర్చీలను ఒకదానిపై ఒకటి ఎత్తుగా పెట్టి.. భార్యను పైకి ఎత్తి వాటిపై కూర్చోపెట్టాలి. అలా ఒక్కో కూర్చీని పైకి పేరుస్తూ.. ఎత్తును పెంచుకుంటూ పోవాలి. అలా ఎవరు ఎక్కువ కుర్చీలపై (ఎత్తు) భార్యను కూర్చోపెడితే ఆ జంటను విజేతగా ప్రకటిస్తారు.
పెళ్లి వేడుకలో బంధువులంతా ఈ టాస్క్‌ను నిర్వహించగా.. దీనిలో దాదాపు నాలుగైదు జంటలు పాల్గొన్నాయి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన భార్యను 17 కుర్చీలు ఎత్తుగా వేసి వాటిపై కూర్చోపెట్టే ప్రయత్నం చేశాడు. కానీ అంత ఎత్తుకు భార్యను ఎత్తలేక ఒక్కసారిగా కింద పడేశాడు. దీనితొ ఆ భార్య నడుము విరిగినంత పని అయింది. ఆ భార్య కు ఏమీ కాకపోవడం తో అక్కడున్న వారందరు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ఆట ని అంత పెళ్లి కి వచ్చిన బంధువు ఒకరు షూట్ చేసి సోషల్ మీడియా లో అప్ లోడ్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్ అవ్వడం తో నెటిజెన్స్ వివిధ రకాల కామెంట్స్ పెట్టి ఆట ని ఆడిన జంట కు బెటర్ లక్ నెక్స్ట్ టైం చెప్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: