మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. ప్రపంచ దేశాలకు పోటీగా భారత దేశాన్ని నిలబెట్టాలని ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు. అయితే టెక్నాలజీ పరంగా ఎంత ముందుకు వెళ్తున్నామో మనిషి తనని తాను నిగ్రహించుకోవడంలో అంత వెనక్కి వెళ్తున్నాడు. 


రోజు ఎక్కడో ఓ చోట చాలా చిన్న కారణానికి ప్రాణాలు వదిలేయడం.. సూసైడ్ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అలాంటి ఓ సంఘటనే జగద్గిరిగుట్టలో జరిగింది. తను అడిగినప్పుడు టీ ఇవ్వలేదని భార్య మీద కోపంతో తన ప్రాణాన్నే వదిలేశాడు ఓ ఆటో డ్రైవర్.  బాలా నగర్ కు చెందిన అడివయ్య ఆటో డ్రైవర్ గా పనిచేసేవాడట. 


ఆదివారం ఉదయం అతను తన భర్యను టీ అడుగ్గా.. ఆమె ఇప్పుడు కాదు తర్వాత ఇస్తానని చెప్పిందట. తను అడిగినప్పుడు టీ ఇవ్వలేదని అవమాన భారంతో దగ్గరలో ఉన్న క్వారీ గుంతలో దూకి మరణించాడట. క్షణికావేశంలో తీసుకున్న అతని నిర్ణయం అతని ప్రాణాలు కోల్పోయేలా చేసింది. 


అసలు టీ ఇవ్వడం కుదరదని చెప్పినందువల్ల అతని సూసైడ్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కేవలం టీ వల్లే గొడవ మొదలైందా లేక మరేదైనా కారణం ఉందా అన్నది విచారణలో తెలుస్తుంది. ఏది ఏమైనా ఈమధ్య జనాలు ఆవేశంతో తమ నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. భార్య టీ ఇవ్వకపోతే బయటకెళ్లి కాఫీ తాగొచ్చు అలాంటిది ఆ అవమానంతో అడివయ్య చనిపోవడం మాత్రం అందరికి షాక్ ఇచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: