అందాల నటి రేఖను చూసి ముంబయి హీరోయిన్స్ చాలా నేర్చుకోవాలి. నార్త్ నుంచి వచ్చి పదేళ్లయినా.. తెలుగు మాట్లాడని హీరోయిన్స్ కు రేఖ స్ఫూర్తిగా నిలిచింది. తెలుగు మాట్లాడటం మానేసి చాలా సంవత్సరాలయినా.. తెలుగు గడ్డపై అడుగుపెట్టగానే.. అచ్చమైన తెలుగులో మాట్లాడి ఆకట్టుకుంది రేఖ. 


ప్రతిష్టాత్మక అక్కినేని ఇంటర్నేషనల్ అవార్డును రేఖకు ప్రదానం చేశారు. ఆదివారం నాడు జరిగిన ఈ కార్యక్రమంలో రేఖ తెలుగులో మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఎంత బాగా మాట్లాడిందంటూ.. సభలో మాట్లాడుకున్నారు. రేఖ తల్లి పుష్పవల్లి తెలుగు అమ్మాయే కావడంతో.. తల్లి నుంచి నేర్చుకున్న తెలుగును మర్చిపోలేదు రేఖ. 


ఏడాది వయసులో రేఖ తెలుగు సినిమా "ఇంటిగుట్టు" తో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత బాలనటిగా "రంగులరాట్నం" సినిమా చేసింది. రేఖ వెండితెరకు పరిచయం కావడానికి ఇన్ డైరెక్ట్ గా అక్కినేని నాగేశ్వరరావు కారణం. తనకు ఊహవచ్చిన తర్వాత చూసిన తొలి సినిమా అక్కినేని నాగేశ్వరరావుదే కావడం.. ఆ సినిమాను 100సార్లు చూశానన్నారు రేఖ. తెలుగు ప్రేక్షకుల ఆశీర్వాదం ఉంటే సినిమా చేస్తానన్నారు. 


చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో మాట్లాడాల్సివచ్చినా.. ఇక్కడే పుట్టి. ఇక్కడే పెరిగిన అమ్మాయిలా తెలుగులో మాట్లాడింది. ఇలా తెలుగులో స్పీచ్ అందర్నీ ఆశ్చర్యపరిచినా.. తనలా తెలుగులో మాట్లాడకూడదంటూ.. తనమీద తనే కౌంటర్ వేసుకుంది రేఖ.  


మరింత సమాచారం తెలుసుకోండి: