ఉరుకులు పరుగుల జీవితం. మన ఆరోగ్యం గురించి మనం ఆలోచించుకోడానికి కూడా సమయం దొరకడం లేదు. జనాలందరూ డబ్బు సంపాదన  వెనుక పరుగులు పెడుతున్నారు. ఇక నేటి ఉద్యోగాలు  కూడా శరీరానికి శ్రమ లేకుండా ఒక దగ్గర కూర్చుని చేసే ఉద్యోగాలే  ఉండడంతో ప్రజల ఆరోగ్యం రోజురోజుకు దెబ్బతింటుంది. అయితే ఇలాంటి ఉద్యోగాలు చేసేవారు రోజువారీ వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలి అని చెప్పినప్పటికీ వారికి వ్యాయామం చేసే సమయం మాత్రం ఉండడం లేదు. వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఉంటామని మనసులో ఉన్నప్పటికీ సమయం దొరకక ఏం చేస్తాంలే అని  లైట్ తీసుకుంటున్నారు. ఇలా వ్యాయామం చేయడానికి సమయం  ఆసక్తి లేకుండా  ఉన్నవారికి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు  నిపుణులు చిట్కాలను సూచిస్తున్నారు. నడవండి ఆరోగ్యంగా ఉండండి అంటూ సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. 



 ఏదో నడిచామంటే నడిచాం  అన్నట్లు కాకుండా నడకకు  కొంత సమయం కేటాయించి ఓ క్రమపద్ధతిలో నడిస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు. అయితే నడవడం స్టార్ట్ చేసిన వారు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. అయితే నడవటం  చేయాలనుకుని నడకను ప్రారంభించిన వారు మొదటి రోజే ఎక్కువ దూరం ఎక్కువ సమయం నడవకూడదని సూచిస్తున్నారు. ఎందుకంటే మొదటి రోజు ఎక్కువ దూరం నడిస్తే తొందరగా అలసిపోతారు అని దీంతో తర్వాత రోజు  నడవడానికి ఆసక్తి చూపారు  అని అంటున్నారు. మన నడక శరీరానికి సరిపోయేలా ఉండాలి  కానీ... అలాకాకుండా మొదటిరోజు అత్యుత్సాహంతో శరీరానికి భరించలేనంత నడిచి ప్రయోగాలు చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు. అదేవిధంగా నడక మొదలు పెట్టాలి అనుకునే వారు సరైన షూస్ ను ఎంచుకోవాలి. షూస్ కంఫర్టబుల్ గా ఉన్నప్పుడే ఎక్కువగా నడవడానికి ఉంటుంది. షూస్ పెద్దవైన చిన్నవైనా నడవడానికి అనువుగా ఉండవు. అందుకే షూస్ తీసుకునే  ముందే వాటిని ఒకసారి ట్రయల్ వేసి చూస్తే మంచిది.



 ఇక తర్వాత నడిచే సమయం పైన దృష్టి సారించారు. ఏ టైం లో పడితే ఆ టైంలో నడిస్తే లాభం ఉండదు.  కేవలం ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రమే నడిచినప్పుడు ఎక్కువగా లాభాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఉదయం నడిచే వారికి రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు ఎనర్జీ దొరుకుతుంది  అంతేకాకుండా సూర్యరశ్మి ద్వారా శరీరానికి డి విటమిన్ లభిస్తుంది. ఇక  సాయంత్రం వేళల్లో నడవడం ద్వారా కూడా నిద్రలేమి సమస్యలు దూరం అవుతాయని వైద్యులు సూచిస్తున్నారు . నడిచే  ప్రదేశాన్ని కూడా సరిగా ఎంచుకోవాల్సి ఉంటుంది. మామూలుగా అయితే నగరాల్లో ఎక్కువగా ఫుట్ పాత్ లపై  నడుస్తుంటారు. కానీ దాని కంటే పార్కుల్లో నడవడం వల్ల కొంత క పాజిటివ్ ఎనర్జీ  దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు. కాగా ఏదైనా శారీరక సమస్యలు ఉన్నప్పుడు నడక ప్రారంభించే ముందు వైద్యుల సలహాలు తీసుకోవడం మేలు. కాగా  నడక ద్వారా దేహదారుఢ్యం తోపాటు స్థూలకాయం రక్తపోటు మధుమేహం గుండెపోటు లాంటి దరిచేరకుండా ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: