ఒకప్పటితో పోలిస్తే నేడు రకరకాల ఎలక్ట్రానిక్ సాధనాలు అందుబాటులోకి రావడం, వాటితో పాటు మొబైల్స్ వినియోగం మరింతగా పెరగడంతో, పిల్లలకు కొద్దిపాటి వయసు రాగానే తల్లితండ్రులు కూడా వారికి సెల్ ఫోన్స్ వంటివి అలవాటు చేస్తున్నారు. అయితే దానివలన కొద్దిపాటి ఉపయోగాలు ఉన్నప్పటీకీ, అలా యుక్త వయసులోనే వారు మొబైల్స్ వంటివి వినియోగించడం వలన, వాటిని ఎక్కువమంది తప్పుడు పద్ధతులకు వాడుతూ తమ జీవితాలను నాశనం చేసుకున్నారని మానసిక నిపుణులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక అటువంటి చర్యల వలన కొందరు యువత యుక్త వయసులోనే శృంగారం పట్ల వ్యామోహంతో తప్పులు కూడా చేయడం మొదలెడుతున్నారు. 

 

ఇక శృంగారం మీద మోజుతో తమ సంఘంలోని కట్టుబాట్లను మరిచి పెళ్ళికి ముందే శృంగారం చేసిన ఒక యువ జంటకు ఇండోనేషియాలో కఠిన శిక్ష విధించారు ఆ సంఘం పెద్దలు. ఇక వివరాల్లోకి వెళితే, ఇండోనేషియా అకే ప్రావిన్స్ కు చెందిన ఓ ప్రేమ జంట పెళ్లి కాకుండానే శృంగారంలో పాల్గొని రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఇక ఈ విషయం కాస్తా అక్కడి షరియా అధికారుల సంఘానికి తెలిసింది. దీంతో వారిద్దరిని తీసుకొచ్చి వారి వీపులపై బెత్తంతో వంద దెబ్బల శిక్ష వేశారు. ఇద్దరిని ఒకే వేదికపై నిల్చొబెట్టి వీపు విమానం మోగేలా దెబ్బల మోత మోగించారు. కాగా దెబ్బలు తట్టుకోలే అరిచినా కానీ, కొంచెం కుడా కనికరించలేదు సరికదా, కొడుతూనే ఉన్నారు అధికారులు. మీ కాళ్లు మొక్కుతాం దెబ్బలు తట్టుకోలేకపోతున్నాం మమ్మల్ని విడిచిపెట్టండి అని ఎన్ని విధాలుగా దండం పెట్టి ప్రాధేయపడ్డనప్పటికీ కనికరించలేదు. మీరు ఎంత అరిచినా కానీ మీరు చేసిన తప్పుకి శిక్ష పడితీరాల్సిందే అని స్పష్టం చేశారు అధికారులు. 

 

అయితే మధ్యలో యువతి ఆరోగ్య పరిస్థితిని గమనించి ఆమెను కాసేపటి తరువాత విడిచిపెట్టారు. ఇక ఆమె ప్రియుడికి మాత్రం ఇదే శిక్షను విధించారు. అసలు అక్కడి అధికారులు అంత కఠినంగా శిక్షలు వేయడానికి కారణం ఏమిటంటే, ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో జూదం, మందు సేవించటం, స్వలింగ సంపర్కం, పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొనడం వంటి అనుమతి లేదు. ఒకవేళ ఈ నిబంధనలు అతిక్రమిసస్తే ఇలా బెత్తంతో వంద దెబ్బలు కొట్టే శిక్షలు విధిస్తుంటారు. కాగా ఈ విషయం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుండడంతో, పలువురు నెటిజన్లు ఈ శిక్షలపై షాక్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: