రాజమౌళి.. దర్శక ధీరుడు ఎన్నో విమిన్నమైన చిత్రాలను చిత్రీకరించి తెలుగు సినిమాకు ఎంతో మంచి పేరు తీసుకొచ్చారు. అలా విభిన్నమైన చిత్రాలలో ఒకటే 'ఈగ' కూడా. ఆ ఈగ సినిమా చూసినప్పుడు అసలు ఇది ఎలా సాధ్యం అని ప్రేక్షకులు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ సినిమాలో ఇగ చూసినప్పుడు అబ్బా మనము ఒక ఈగను బాగుంటుంది అని కూడా అనిపించి ఉంటుంది. 

 

కానీ అది సాధ్యం కాదు అని అందరికి తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో యువత ఆలాంటి భిన్నమైన ఆలోచనతో ఒక వ్యక్తి తేనెటీగ పేరు మీద ఇంస్టాగ్రామ్ లో ఒక అకౌంట్ ఓపెన్ చేసి తన ఫాలోవర్లను రోజు రోజుకు ఒక రేంజ్ లో పెంచుకుంటుంది. ఆ ఫాల్లోవర్లను చూసి హాలీవుడ్ స్టార్లకు సైతం వణుకు పుడుతుంది. రాజమౌళి ఈగ ఏంటి ? తేనెటీగా ఏంటి అని అనుకుంటున్నారా ? అయితే ఇది చదవండి.. 

 

ఇంకా వివరాల్లోకి వెళ్తే.. ఇన్‌స్టాగ్రామ్‌లో 'bee_nfluencer' అనే పేరుతో ఎనిమిది నెలల క్రితం ఓ వ్యక్తి తేనెటీగా ప్రొఫైల్ ని ప్రారంభించాడు. ఈ తేనెటీగా అకౌంట్ కి ఫాలోవర్లు పెరిగితే డబ్బులు వస్తాయని, ఆ మొత్తాన్ని తేనెటీగలు పరిరక్షించేందుకు ఉపోయోగిస్తామని అతడు ప్రకటించాడు. దీంతో ఆ అకౌంట్ కి అతి తక్కువ సమయంలోనే 2.26 లక్షల మంది ఫాలోవర్లు పెరిగారు. 

 

అయితే ఆ ఫాలోవర్లు పెరిగినట్టే ఆ తేనెటీగా వివిధ ప్రాంతాల్లో తిరిగి వివిధ రకాలలో పోజులు ఇచ్చి ఫోటోలు, సెల్ఫీలు తీసుకొని ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి ఫాలోవర్ల మనసు దోచుకుంతుంది. ఇపుడు సినీ తారలా కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఈ తేనెటీగకు ఉన్నారు. ఒక్క దీనికి మాత్రమే కాదు ఇలా జంతువుల పేరుతో ఉన్న ఎన్నో అకౌంట్స్ కు భారీస్థాయిలో ఫాలోవర్స్ ఉన్నారు. మీకు కూడా ఇలా ఫాలోవర్స్ కావాలనుకుంటే మీరు కొత్తగా క్రియాటివ్ ఐడియాతో ప్రయత్నించండి. పాపులర్ అవ్వండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: