ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస మార్కెట్లో మన దేశం నుంచి మూడు నగరాలు చోటు దక్కించుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ 9వ స్థానంలో నిలవగా.. బెంగళూరు 20, ముంబై 28వ స్థానంలో నిలిచాయి. 2019 మూడో త్రైమాసికానికి అంతర్జాతీయ స్థిరాస్తి కన్సల్టెంట్ సమస్త నైట్ ఫ్రాంక్ ఈ జాబితాను రూపొందించింది. స్థానిక మార్కెట్లో రియల్టీ ధరల ఆధారంగా ఈ ర్యాంక్‌లను కేటాయిస్తుంది. 2019 రెండో త్రైమాసికం నివేదిక ప్రకారం లగ్జరీ రెసిడెన్షియల్‌ మార్కెట్లో మొదటి స్థానంలో రష్యా రాజధాని మాస్కో నిలిచింది. 

 

గత ఏడాది కాలంలో ఇక్కడ గృహాల ధరలు 11.1 శాతం వృద్ధి చెందాయి. మన దేశంలో ప్రభుత్వ విధాన నిర్ణయాలు అఫర్డబుల్, మధ్య స్థాయి గృహాల అభివృద్ధికే పరిమితమయ్యాయి. దీంతో లగ్జరీ ప్రాపర్టీలు సంఘటిత కంపెనీలు, నిధులు సమృద్ధిగా ఉన్న కంపెనీలు మాత్రమే చేస్తున్నాయి’’ అని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా సీఎండీ శిశీర్‌ బైజాల్‌ వ్యాఖ్యానించారు. అలాగే  ఫ్రాంక్‌ఫ‌ర్ట్ రెండో స్థానంలో (ధ‌ర‌ల్లో వృద్ధి 10.3%) నిల‌వ‌గా.. తైపీ (8.9%) మూడో ర్యాంకు పొందింది.  అలాగే సియోల్‌కు జాబితాలో ఆఖ‌రి ర్యాంకు ల‌భించింది. ఈ న‌గ‌రంలో ఖ‌రీదైన గృహాలు ధ‌ర‌లు 12.9 శాతం ప‌డిపోయాయి.

 

రెండో త్రైమాసికంతో పోలిస్తే ఢిల్లీ ఒక స్థానాన్ని మెరుగుప‌ర్చుకొని 9వ స్థానానికి ఎగ‌బాకింది. గ్రేటర్ కైలాష్, వసంత విహార్, ఆనంద్ నికేతన్, డిఫెన్స్ కాలనీ మరియు గ్రీన్ పార్క్ వంటి ప్రాంతాలలో సగటు లగ్జరీ గృహాల ధరలు సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో సంవత్సరానికి 4.4% పెరిగాయి. ఇతర కీలక మార్కెట్లలో, బెంగళూరు మరియు ముంబై జాబితాలో 20 మరియు 28 వ స్థానంలో ఉన్నాయి, ధరలు వరుసగా 2.1% మరియు 0.8% పెరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: