ఎలాంటి ముందు జాగ్రత్తలు లేకుండా పాల్గొనే శృంగారంలో కొంత భయం ఉంటుంది. ఎందుకంటే పెళ్లి కాని వారు గాని, పిల్లలు వద్దనుకునే భార్య భర్తలు గాని ముందు జాగ్రత్త తీసుకోకుంటే గర్భం వచ్చే అవకాశం ఉంది.

 

 

కాని ఈ అవాంచిత గర్భం రాకుండా కొన్ని పద్దతులున్నాయి. అందులో మహిళలకు అనవసరంగా గర్భం రాకూడదనుకుంటే టూబెక్టమీ ఆపరేషన్‌తో సహా టాబ్లెట్లు, ఇంజెక్షన్లు, ఇంప్లాంట్స్, నిరోధ్‌లు. టూబెక్టమీ మినహా మిగతా అన్నింటి వల్ల మహిళలకు సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయి. కాని మగవాళ్లకు వాసెక్టమీ ఆపరేషన్‌తోపాటు నిరోధ్‌లు ఉన్నాయి.

 

 

ఇకపోతే వీటి వల్ల సంతప్తి కలగదనే భావం చాలా మంది ఆడవాళ్లలో ఉండడంతో, మగవారికి అదే తరహాలో ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్ల కోసం భారత వైద్య పరిశోధకులు 13 ఏళ్లపాటు ప్రయోగాలు నిర్వహించి ఇప్పుడు విజయం సాధించారు.. అదే మగవారికి ఈ ఇంజక్షన్ చేస్తే పిల్లలు పుట్టడానికి కావలసిన శుక్రకణాలను అడ్డుకుంటుందని తెలిపారు.

 

 

ఇకపోతే ఈ ఇంజెక్షన్‌ను వరి బీజాలకు ఇస్తారు. అందుకు నొప్పి తెలియకుండా అనెస్తీసియా ఇవ్వాల్సి ఉంటుందట. ఇక చట్టబద్ధమైన మూడు ట్రయల్స్‌ను ఐసీఎంఆర్‌ విజయవంతంగా పూర్తి చేసిందని పాతికేళ్లపాటు ఈ విషయంలో పరిశోధనలు సాగించిన డ్రగ్స్‌ కంట్రోలర్‌ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ శర్మ మీడియాకు తెలిపారు.

 

 

ఈ  ఇంజెక్షన్‌ ఉత్పత్తికి లాంఛనంగా భారత్‌ లైసెన్స్‌తోపాటు ‘అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌’ అనుమతి తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఇక అందరికి  ఈ ఇంజెక్షన్‌ మరో ఆరు నెలల్లో అందుబాటులోకి రానుందని అంటున్నారు.. ఇదే కాకుండా ప్రపంచంలో మగవారి గర్భ నిరోధానికి ఇంజెక్షన్‌ పద్ధతిని ప్రవేశపెడుతున్న దేశంగా భారత్‌ రికార్డు సృష్టించ బోతోందని డాక్టర్‌ శర్మ తెలిపారు. ఇప్పటివరకు 303 మందికి ఈ ఇంజెక్షన్‌ ఇవ్వగా 97.3 శాతం మందికి ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ రాలేదని ఆయన చెప్పారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: