పిల్లలు దేవుళ్లతో సమానం.. వారి మాటలు దేవుడి మాటలతో సమానం అని పెద్దలు అంటూ ఉంటారు. అయితే పసి పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవ పడితే పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది ? ఆ ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుంది ? పిల్లల మానసిక ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. కనీసం ఇది చదివి అయినా పిల్లల ముందు గొడవ పడటం మానండి. 

 

తల్లిదండ్రులు తగవులు పడటం కారణంగా పిల్లల దీర్ఘకాలిక మానిసకాభివృద్ధి, ఆరోగ్యాల మీద నిజంగా ప్రభావం చూపుతాయి. తల్లిదండ్రులకు తమ చిన్నారితో సంబంధం ఎలా ఉంటుందనేదే కాదు.. తల్లిదండ్రుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయనేది కూడా చిన్నారి సంక్షేమంలో పెద్ద పాత్ర పోషిస్తాయి. 

 

మానసిక ఆరోగ్యం నుంచి చదువుల్లో రాణించటం వరకూ.. భవిష్యత్తులో చిన్నారుల సంబంధ బాంధవ్యాల వరకూ ప్రతి అంశం మీదా అవి ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. తరచుగా గొడవలు చూసే, వినే చిన్నారులు ఆరు నెలల వయసు పిల్లలు సైతం - గుండె కొట్టుకునే వేగం పెరగటం, ఒత్తిడి హార్మోన్లు స్పందించటం వంటి వాటికి ఇబ్బంది పడచ్చని వైద్యులు చెప్తున్నారు. 

 

తీవ్రంగా లేదా తరచుగా ఘర్షణ పడే తల్లిదండ్రులతో కలిసి నివసించే పసివారు, చిన్నారులు, యుక్తవయస్కుల్లో.. మెదడు అభివృద్ధికి ఆటంకం ఏర్పడటం, కలత నిద్ర, ఆదుర్దా, కుంగుబాటు, ప్రవర్తనా లోపం, ఇతర తీవ్ర సమస్యలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే పిల్లలు మానసికంగా, ఆరోగ్యంగా తెలివిగా ఉండాలంటే తల్లిదండ్రులు గొడవలు పడటం తగ్గించాలి.. 

 

అంతేకాదు ఎన్ని గొడవలు ఉన్న సరే పిల్లల ముందు గొడవపడకుండా బెడ్ రూమ్ వరుకే ఆ గొడవలు పెట్టకోవాలి. అప్పుడే పిల్లలు ఆనందంగా మానసికంగా ఆరోగ్యకరంగా ఉంటారు. ఆలా కాదు అని పిల్లల ముందు గొడవ పడి బెడ్ రూమ్ లో ఆనందంగా ఉంటాము అంటే పిల్లలు మానసికంగా కుంగి పోతారు. అందుకే పిల్లల ముందు తగువులు మంచివి కావు. 

మరింత సమాచారం తెలుసుకోండి: