మంచి సాంప్రదాయాలకు పుట్టిల్లు మన భారతదేశం. భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న సంప్రదాయాలు కలగలిపిన భూలోక స్వర్గం మన దేశం. పెళ్లి అంటే మన దేశం లో ఎంతో పవిత్రం గా భావిస్తారు. యుక్త వయసు వచ్చిన ఆడ పిల్లల్ని గడప దాటి బయటకి పంపాలంటే ఒకటికి వెయ్యి సార్లు ఆలోచిస్తాం. ఇలాంటి ఆలోచనలు ఉన్న మన దేశం లో ఇప్పటికీ కొంతమంది వింత ఆచారాలు పాటిస్తున్నారు అంటే నమ్ముతారా?. 

 

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాకు చెందిన ఓ గ్రామం లో 'పెళ్లి కి ముందే శోభనం' అవును మీరు వింటున్నది నిజమే. ఈ గ్రామంలో పెళ్లికి ముందు సెక్స్ కామన్. ఈ వింత ఆచారం ఆ తెగ లో తరతరాల నుంచి వస్తోంది. సెక్స్ పట్ల వీళ్లది ఓపెన్ మైండ్. ఎంత ఓపెన్ మైండ్ అంటే పెళ్లి కాకున్నా ఒకే ఇంట్లో భార్యాభర్తల్లా కలిసి ఉండొచ్చు. సెక్స్ జీవితాన్ని స్వతంత్రంగా ఎంజాయ్ చేయవచ్చు. అడిగే వారు, అడ్డు చెప్పేవారు ఉండరు. అక్కడ ఒక బిడ్డను కన్న తర్వాత కూడా పెళ్లి చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. అంటే ముందు శారీరకంగా ఒక్కటి అయ్యాక పెళ్లి చేసుకుంటారన్నమాట. ఈ తరహా సంఘటనలు మనం విదేశాల్లో చూస్తుంటాం కానీ ఈ తెగకు ఇదొక ఆచారం.

 

కేవలం ఛత్తీస్‌గఢ్‌లోనే కాదు రాజస్థాన్‌లోని గరాసియా అనే తెగ ప్రజలు కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అమ్మాయికైనా, అబ్బాయికైనా సరే తనకు ఇష్టమైన వ్యక్తిని ప్రేమించే, పెళ్లి చేసుకునే లేక సహజీవనం చేసుకునే హక్కు ఉంది.ముందు గా అమ్మాయి అబ్బాయి ఇష్ట పడితే వాళ్ళు సెక్స్ లో పాల్గొనవచ్చు ఒకే ఇంట్లో కలిసి ఉండొచ్చు తరువాత పెళ్లి చేసుకోవచ్చు. ఈ విషయం లో అక్కడి గ్రామస్థులు కానీ పెద్ద మనుషులు కాని ఆ యువ జంటలకు అడ్డు చెప్పరు.

మరింత సమాచారం తెలుసుకోండి: