ఛాయ్ తాగితే వచ్చే ఉత్సాహమే వేరు అంటున్నారు టీ ప్రేమికులు. చాలమందికి గొంతులో ఛాయ్ పడందే దినచర్య మొదలు కాదు. ఇక ఛాయ్‌లు మీద ఛాయ్‌లు లాగించేవారు ఉన్నారు. వాస్త‌వానికి నిద్ర లేచింది మొదలు నిద్ర పోయేవరకూ మనిషి జీవితంలో చాయ్  పాత్ర అమోఘమైంద‌ని చెప్పాలి. 4వ శతాబ్ధంలో చైనాలో పుట్టిన టీ, ప్రంపచంలోని దాదాపు అన్ని దేశాల్లో స్థానం సంపాధించుకుంది. మనుషుల మధ్య అనుబంధానికి అనుసంధానంగా మారింది. తాగునీటి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టంగా తాగే పానియంగా గుర్తింపు పొందింది. 

 

అలాగే ఒక్కో `టీ` కి ఒక్కో ప్ర‌త్యేక‌త ఉంటుంది. అల్లం టీ అంటే అదిపెంచెను ఆరోగ్యం.. మసాలా టీ అంటే అది దించునురా మైకం.. లెమన్ టీ కొడితే ఇక లేజీ మటుమాయం.. ఇరానీ టీ పడితే ఇటురాదా ఆ స్వర్గం.. అన్న లిరిక్ మీరు వినే ఉంటారు. ఇది నూటికి నూరు శాతం వాస్త‌వం. అయితే  భారత దేశంలో ఎన్నో రకాల టీలు అందుబాటులో ఉన్నా.. బెస్ట్ చాయ్ మాత్రం ‘మసాలా చాయ్’ అంటున్నారు నిపుణులు. బరువు తగ్గేందుకు గ్రీన్‌ టీ తాగుతారు చాలామంది. ఘాటుగా, టేస్టీగా ఉండే మసాలా చాయ్‌ తాగినా క్యాలరీలు ఖర్చవుతాయి. 

 

దీనిలోని మసాలా దినుసులు క్యాలరీలను కరిగిస్తాయి. అంతేకాదు తలనొప్పి, గొంతు నొప్పి వంటివి క్షణంలో మాయమైతాయి. ఒక కప్పు మసాలా టీ అనేకరకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మసాలా టీలో జోడీంచే లవంగాలు, దాల్చిన చెక్క వంటివి వ్యాధినిరోధకతను పెంచడంలో సహాయపడుతాయి. మసాలా టీలో ఉన్న మసాలాలు జీర్ణక్రియను మేలు చేస్తుంది. మసాలా టీలో వేసి అల్లం, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: