ప్రస్తుతం ఒక చైనా డాక్టర్ని నెటిజన్లు అంతా కొనియాడుతున్నారు.. హీరోగా పేర్కొంటున్నారు ఎందుకో తెలుసా? ఎందుకంటే ఒక ముసలాయన మూత్రాశయం దాదాపు లీటర్ మూత్రం తో నిండిపోయి ఉండి... అతను చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ చైనా డాక్టర్ తన నోటితో ఎనిమిది వందల మిల్లీగ్రాముల మూత్రాన్ని బయటకు పీల్చి అతని ప్రాణాలను కాపాడాడు.

వివరాల్లోకి వెళితే, గుయాంగ్జ్హౌ నుంచి న్యూ యార్క్ వెళుతున్న చైనా సదరన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ లో ఒక 70 ఏళ్ల ముసలాయన ఉన్నాడు. అయితే ఆ ముసలాయన విమానం లో ఉన్నప్పుడు..ఒక ఆరోగ్య సంబంధిత సమస్య వచ్చింది. అదేంటంటే అతని మూత్రాశయం బాగా ఉబ్బిపోయి మూత్రం పోసుకోవడం కుదరక అతను బాగా బాధపడుతున్నాడు... ఇంకా అతని ఒంటి నిండా చెమటలు బాగా వస్తున్నాయి. అయితే అతని అసౌకర్యాన్ని గమనించిన విమాన సిబ్బంది వెంటనే... 'విమానంలో ఎవరైనా డాక్టర్స్ ఉంటే ఈ పెద్దాయనకి సాయం చేయండి' అంటూ అనౌన్స్మెంట్ చేశారు. దాంతో ఆ విమానంలో ప్రయాణిస్తున్న డాక్టర్ జహాంగ్ వెంటనే ఈ పెద్దయన దగ్గరకు వచ్చి అతని దారుణ పరిస్థితిని గమనించాడు. జహాంగ్ దగ్గర ఏ వైద్య సంబంధిత పరికరాలు లేవు. దీంతో ఏం చేసేది లేక విమానంలో ఉన్న కొన్ని పరికరాలను ఉపయోగించి ఆ ముసలాయన ప్రాణాలను కాపాడదామని డా. జహాంగ్ నిశ్చయించుకున్నాడు.


దానికోసం... అతను ఒక సిరంజి సూదిని, ఆక్సిజన్ మాస్కును, స్ట్రా సైజు ఉన్న ఒక చిన్న పైపును విమానం నుంచి సేకరించాడు. ఆ సిరంజి సూదిని పెద్దాయన మూత్రాశయానికి గుచ్చి..రంద్రం చేసి.. ఆ తర్వాత చిన్న సైజు పైపును మాత్రాశయంలోకి పెట్టాడు. కానీ పీల్చడానికి ఏ పరికరం లేకపోవడంతో ఆ డాక్టరే స్వయంగా అతని నోటితో 37 నిముషాలు పాటు మూత్రాన్ని బయటకు పీల్చుతూ.. దాన్ని ఒక వైన్ గ్లాస్ లో ఉస్తూ హాస్పిటల్ దగ్గరకు వచ్చేంతవరకు ఆ పెద్దాయన్ని చనిపోకుండా బ్రతికించాడు.

"ఒకేసారి మూత్రాన్ని బయటకి తీయడం కుదరదు. ఒకవేళ అలా చేస్తే అతని మూత్రాశయం పగిలిపోయిద్ది. చనిపోయే ప్రమాదం ఉంది. మూత్రాశయానికి 1 లీటర్ యూరిన్ కంటే ఎక్కువ నిల్వ ఉంచే సామర్థ్యం లేదు. ఆ పెద్దాయన మూత్రాశయం బాగా ఉబ్బి పగిలిపోయేలా ఉంది. కొంచెమైన యూరిన్ ని బయటకి తీయకపోతే అతని బ్లాడర్ పగిలిపోతుంది. అందుకే ఎం ఆలోచించకుండా నేను సాయం చేసి అతన్ని కాపాడను." అని ఆ డాక్టర్ చెప్పాడు.

ప్రస్తుతం డాక్టర్ కాపాడే దృశాలు ఆసియావైర్ వెబ్సైట్ లో అప్లోడ్ చేసారు. యూట్యూబ్ లో కూడా ఉంది ఈ వీడియో. ఈ దృశాలను చూసిన నెటిజన్లంతా డాక్టర్ జహాంగ్ ని హీరో అని పిలుస్తున్నారు. 

Doctor saves a 70 year old man

మరింత సమాచారం తెలుసుకోండి: