ప్రస్తుత కాలంలో కాలుష్యం పెనుభూతమై కాటేస్తోంది. అయినా ఇంటి నిండా ఫ్లాస్టిక్ వస్తువులే దర్శనమివ్వడం పరిపాటిగా మారుతున్నాయి. కాలంతో వేగంగా మారుతున్న జీవితాలతో ఫ్లాస్టిక్ ఇంట్లో ఓ భాగం అయిపోయింది. లేచింది మొదలు మళ్లీ నిద్దురకు ఉపక్రమించే వరకు ఫ్లాస్టిక్ జీవితాలే అన్ని అన్నట్టుగా మారుతున్నాయి. దీంతో క్యాన్సర్ మహమ్మారి వెంటాడమే కాదు ప్రకృతి కూడా వినాశనం వైపు అడుగులు వేస్తోంది. 

 

Image result for అరటి ఆకులో భోజనం... అబ్బో ఏమి రుచి...

ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని ఎంతో మంది నోరు మొత్తుకొని చెబుతున్న జనం మాత్రం మారడం లేదు. అయితే మేము మాత్రం అలా కాదు మార్పు వైపు అడుగులు వేస్తున్నాం.. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు నడుం బిగిస్తున్నాం అంటున్నారు సీమ వాసులు. గత శతాబ్ద కాలం క్రితం వరకు ఇంటికి చుట్టంగా మారిన అరటి ఆకులను మళ్లీ సాదరంగా ఆహ్వనిస్తున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రాలకు పుట్టినిళ్లు అయినా చిత్తూరు , కర్నూలు జిల్లాల్లో మళ్లీ ఆనాటి జ్ణాపకాలను పరిచయం చేస్తున్నారు. మరి మనం కూడా ఆ అరిటాకు కబుర్లు తెలుసుకుని వద్దామా. పదండి. 

 

Related image

ఆకు పచ్చని అరటాకులో భోజనం చేస్తే ఉంటుంది నా స్వామిరంగా.. ఆ టేస్టే వేరబ్బ అంటున్నారు సీమ వాసులు. గోదారోళ్లు అరటాకుల్లో తింటారా..? మాది అంతకు మించిన సంప్రదాయం అంటున్నారు సీమ వాసులు. కార్తీక మాసం వేళ వనభోజనాల పేరిట చుట్టాలకు కబురంపి మరీ పెద్ద ఎత్తున భోజనాలు రెడీ చేయించి పచ్చని ప్రకృతి ఒడిలో అంతే పచ్చని అరిటాకులో కమ్మని భోజనాన్ని వడ్డిస్తున్నారు. 

 

వేడివేడి అన్నంలో ఇంత నెయ్యి వేసీ మరీ వడ్డిస్తున్నారు. దీంతో ఆ వేడికి అరిటాకు మరింత కమ్మని రుచిని జతచేసి ఓ ముద్ద ఎక్కువగానే తినేస్తున్నారంటా. అమ్మయ్య ఎన్ని రోజులకు ఇంత కమ్మని భోజనం చేసమబ్బి అంటూ ఆశీర్వచనాలు కూడా అందిస్తున్నారు. అయితే వంటలో ఏ మార్పు రాకపోయిన వండిన తీరు వడ్డించిన గుణం కలగలిపి ఈ టేస్ట్ వస్తుందని చెపుతున్నారు. 

Image result for అరటి ఆకులో భోజనం... అబ్బో ఏమి రుచి...

 

ఇక ఇంటిలోకి తిరిగి ఎంట్రీ ఇచ్చిన అరిటాకు ఇప్పుడు స్థానికంగా ఉన్న హోటళ్లూ రెస్టరెంట్లలోకి కూడా అడుగు పెడుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏడుకొండల వాడి దర్శనార్ధం వస్తున్న భక్తులకు రోడ్డు మీద బడ్డి కొట్టు నుండి మొదలు ఫై స్టార్ హోటల్ల వరకు అరిటాకులోనే వడ్డించి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు హోటల్ యజమానులు. అంతేకాదు పార్సల్ సర్విస్ లోను అరిటాకునే నమ్ముకుంటున్నారు. స్వీట్లు , లడ్డులు , టిఫిన్ , భోజనాలు అన్ని అరిటాకులో ఇస్తుండటంతో కస్టమర్లు సైతం ఆ రుచిని టేస్ట్ చేసి వారెవ్వా ఏం టేస్ట్ గురూ అంటున్నారంటా. 

 

అయితే సీమకు కంటే ముందు ఈ అరిటాకు భోజనాల చాలా చోట్ల ఫేమస్ కానీ వాడకాన్ని తగ్గించారు. ఇప్పుడిప్పుడే తిరిగి మళ్లీ పాతరోజుల్లోకి తొంగి చూస్తున్నారు. అరిటాకు వాడకంతో ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌-ఎ, సిట్రిక్‌ ఆమ్లం, కాల్షియం, కెరోటిన్‌ వంటివన్నీ ఆహారంలో కలిసి వంటకానికో ప్రత్యేక రుచిని తెస్తాయి. ఆ కారణంతోనే అనేక ప్రాంతాల్లో ఆకుల్ని వంటల తయారీకీ వాడుతుంటారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల్లో చేప, పుట్టు, ఇడ్లీ, డోక్లా వంటి కొన్ని ప్రత్యేకమైన వంటకాలను ఆకుల్లో పెట్టి వండుతారు. మలబారు తీరంలో అరిటాకులో వండే కిజి బిర్యానీ రుచి ఈమధ్య దేశవిదేశీయులెందరినో అలరిస్తోంది. 

 

ఫుడ్‌ పార్సిల్స్‌ కోసం కాగితం, ప్లాస్టిక్‌, అల్యూమినియం ఫాయిల్‌ ఇలా వేటిని వాడినా అందులోని ఇంకూ ఇతరత్రా రసాయనాలన్నీ ఆహారంలో అంతో ఇంతో కలుస్తాయి. అందుకే వాటి వాడకాన్ని తగ్గించడానికి ఆకులను వాడుతున్నామని చెపుతున్నారు మరి కొందరు. ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయంగా కూరగాయలూ ఆకుకూరల ప్యాకింగుల కోసం అరటి ఆకుల్నే వాడుతున్నామని చెప్తున్నారు.

 

పెళ్లి వేడుకల్లోను ఈ అరిటాకు సంప్రదాయాన్ని తిరిగి తీసుకురావాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. ఓ వైపు పర్యావరణరీత్యా ప్లాస్టిక్‌ వాడకం తగ్గించాలన్న నిర్ణయం మరో వైపు ప్రకృతి ఒడిలో సాగాలన్న నిర్ణయం.. అరిటాకు వాడకం పెరగడానికి కారణంగా తెలుస్తోంది. ఏది ఏమైతేనేం మళ్లీ ఆ పాత జ్ణాపకాలను ఆహ్వనిస్తూ ప్లాస్టిక్ కు దూరంగా అనారోగ్యానికి అత్యంత దూరంగా వెళుతున్న ఈ నిర్ణయాన్ని అందరూ ఆహ్వనించాల్సిందే. ఆకేసి పప్పేసి నెయ్యేసి నీకో ముద్దా నాకో ముద్దా అంటూ పాట పాడుకుంటూ ఆరిగించేద్దాం. పచ్చని అరిటాకులా మన జీవితాలను కూడా నిండు నూరేళ్లు పచ్చగా ఉంచుకుందాం ఓకేనా.

మరింత సమాచారం తెలుసుకోండి: