పెళ్లి ఓ మ‌ధుర‌మైన అనుభూతి.. కొత్త జీవితానికి పునాది..! సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు, బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వాస్త‌వానికి పెళ్లి అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. దానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. మనకు ఎన్ని బంధాలు ఏర్పడ్డా కూడా వివాహ బంధానికి మించినది ఉండదు. ప్రతి ఒక్కరి జీవితం పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత అన్నట్లుగానే ఉంటుంది. అయితే ప్ర‌స్తుత స‌మాజంలో చాల మంది యువత పెళ్లికి సమయం తీసుకుంటున్నారు. 

 

దీనికి చాలా కార‌ణాలు ఉండ‌వ‌చ్చు. ముఖ్యంగా యూత్ లైఫ్ సెటిల్ అయ్యేంత వరకు పెళ్లికి నో చెబుతున్నారు. అయితే పెళ్లి చేసుకోవటం వల్ల గొప్ప ప్రయోజనం కల్గుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. పెళ్లి చేసుకోవ‌డం వ‌ల్ల ఆయుష్షు పెరుగుతుందంట. గుండెకు సంబంధించిన రోగాలు రావట. ఒంటరిగా ఉంటున్న వారితో పోలిస్తే వైవాహితుల‌కు గుండెకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, మ‌తిమ‌రుపు వంటి స‌మ‌స్య‌లు వచ్చే అవకాశాలు తక్కువని, ఎక్కువకాలం జీవిస్తారని చెబుతున్నారు.  

 

50- 70 ఏళ్ల వయస్సున్న వారిపై జరిపిన పరిశోధనలో ఒంటరిగా ఉన్న వారి కంటే వివాహితులే 16 శాతం ఎక్కువ కాలం జీవిస్తున్నార‌ని తేల్చారు. అలాగే మతిమరుపు, డిమెన్షియా సమస్యలు తక్కువని కనుగొన్నారు. ఎందుకంటే వివాహ బంధంలో కనిపించే ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు తీసుకునే శ్రద్ధ వల్ల మానసిక ఆరోగ్యంగా ఉంటారని తద్వారా గుండెనొప్పి, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఒంటరిగా ఉన్న వారి కంటే తక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని తేల్చి చెప్పారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: