కొంతమంది ఇంట్లో ఫ్రిజ్ ఉంటే ఏవి పడితే అవి ఫ్రిజ్ లో పెడుతూ ఉంటారు. కొన్ని పదార్థాలు ఫ్రిజ్ లో పెడితే ఆ పదార్థాలు పాడు కాకుండా ఉంటాయి. కొన్ని పదార్థాలు ఫ్రిజ్ లో పెడితే పాడు అవ్వడమే కాకుండా విషంగా మారతాయి. ఫ్రిజ్ లో చాకోలేట్స్, పండ్లు, ఆకు కూరలు, పచ్చి కొబ్బరి చిప్పలు, కొబ్బరి నీళ్లు, పాలు, పెరుగు, కంటి, చెవి డ్రాప్స్, క్రీమ్ బిస్కెట్స్ ఉంచాలి. పండ్లలో అరటిపండును మాత్రం ఫ్రిజ్ లో ఉంచకూడదు. 
 
బంగాళదుంపలను ఫ్రిజ్ లో ఉంచకూడదు. బంగాళదుంపలను ఫ్రిజ్ లో ఉంచితే బంగాళదుంపలోని తేమ ఆవిరై లోపల ఉండే పిండి పదార్థం తేమను కోల్పోతుంది. అందువలన బంగాళదుంపలతో తయారు చేసిన వంటకాలు రుచి, పచి లేకుండా పోతాయి. టమాటాలను కూడా ఫ్రిజ్ లో ఉంచకూడదు. టమాటాలను ఫ్రిజ్ లో ఉంచితే టమటాలో ఉండే విటమిన్ సి తగ్గిపోవటంతో పాటు టమాటాతో చేసిన పదార్థాల రుచి కూడా తగ్గిపోతుంది. 
 
మునగకాడలను కూడా ఫ్రిజ్ లో ఉంచకూడదు. మునగకాడలను ఫ్రిజ్ లో పెట్టడం వలన మునగకాడలలోని తేమ పోతుంది. చాలామంది తేనెను ఫ్రిజ్ లో పెడతారు. తేనెను ఫ్రిజ్ లో పెట్టటం వలన తేనెలోని సహజ గుణాలు పోతాయి. పుచ్చకాయలను ఫ్రిజ్ లో పెట్టకూడదు. పుచ్చకాయలను ఫ్రిజ్ లో పెడితే పుచ్చకాయలోని యాంటి ఆక్సిడెంట్లు అన్నీ పోయి పుచ్చకాయ రుచి మారడం లేదా పుచ్చకాయ కుళ్లిపోవడం జరుగుతుంది. ఉల్లిపాయలను, వెల్లుల్లిపాయలను కూడా ఫ్రిజ్ లో ఉంచకూడదు. చిల్లీ హాట్ సాస్ ను కూడా ఫ్రిజ్ లో ఉంచకూడదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: