అమెరికాలోని అర్కాన్సాస్‌కు చెందిన చాస్టిటీ ప్యాటర్సన్‌ కు జరిగిన అనుభవాన్ని చూస్తే అచ్చం సినిమా సన్నివేశం లాగానే అనిపిస్తుంది. చాస్టిటీ ప్యాటర్సన్‌ కు వాళ్ళ నాన్న అంటే ఎంతో ప్రాణం. తాను పుట్టిన దగ్గరి నుంచి తనకు నాన్న అంటే ఎంతో ప్రేమ, ఎప్పుడూ తన నాన్నతోనే అన్నీ విషయాలను పంచుకునేది. కానీ విధి వక్రీకరించి.. చాస్టిటీ 18 ఏళ్ల వయసులో ఆ తండ్రి ఒక ప్రమాదంలో మరణించాడు. పాపం తన తండ్రి అంటే ఎంతో ప్రేమ ఉన్న ఆ కూతురి..తండ్రి మరణించాడన్న వార్త విని తల్లడిల్లి పోయింది. పాపం తన చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన తన తండ్రి లేక పోయే సరికి... తాను ఆ బాధను జీర్ణించుకోలేక పోయింది. తన భావోద్వేగాలని ఎవరితో పంచుకోలేక వంటరి అయిపోయి డిప్రెషన్లోకి వెళ్లి పోయింది.



తనకి రోజు జరుగుతున్న సంఘటనలను.. తన నాన్న నెంబర్ కు మెసేజ్ చేస్తూ.. వాళ్ళ నాన్న ఉన్నట్లు ఊహించుకుని కాలం గడుపుతూ వచ్చింది. తండ్రి ఆ మెసేజులు చూడడని తెలిసినా ఇష్టం కొద్దీ తన క్యాన్సర్‌ ట్రీట్‌మెంటూ, చదువూ, ప్రేమా, బ్రేకప్‌ వంటి వాటన్నింటి గురించి ఎప్పటికప్పుడు తండ్రి నంబరుకు మెసేజులు చేస్తుండేది. తండ్రి చనిపోయి.. నాలుగేళ్ళు గడిచాయి.. కానీ చాస్టిటీ ప్యాటర్సన్‌ తన తండ్రికి మెసేజ్లను పంపించడం మాత్రం ఆపలేదు. అయితే నాలుగేళ్ళ తర్వాత... ఒకరోజు ఊహించని విధంగా... వాళ్ళ నాన్న నెంబర్ ను ఉపయోగించే బ్రాడ్‌ అనే వ్యక్తి నుంచి.. ఈమె చేసే మెసేజ్ లకు రిప్లై వచ్చింది.

‘హాయ్‌ నేను నీ తండ్రిని కాదు. ఆ ఫోన్‌ నంబరు నాకు అలాట్‌ అయింది. నాలుగేళ్ల నుంచీ నీ మెసేజులు చదువుతూ వాటిలో నీ ఎదుగుదల చూశాను. వెంటనే రిప్లై ఇస్తే మెసేజులు ఆపుతావని మౌనంగా ఉన్నా. ఎందుకంటే నీ సందేశాల్లో ఆరేళ్ల క్రితం కారు ప్రమాదంలో చనిపోయిన నా కూతుర్ని చూసుకుంటున్నా. ఎప్పటికీ ఇలాగే మెసేజులు పంపుతుండవా ప్లీజ్‌’ అంటూ మెసేజ్‌ పెట్టాడు.

దేవుడే.. బ్రాడ్‌ అనే వ్యక్తి రూపంలో తనకు తండ్రిని ప్రసాదించాడని చాస్టిటీ.. ఈ విషయాన్నీ తెలియజేస్తూ.. తన చాటింగు స్క్రీన్‌ షాట్లనీ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. ఇప్పుడు ఆమె షేర్ చేసిన ఫేసుబుక్ పోస్ట్ చదివిన వారంతా బాగా బావోద్వేగానికి గురవుతున్నారు. అదేవిధంగా.. ఆమె చాటింగు స్క్రీన్‌ షాట్లు బాగా వైరల్ అవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: