ఎర్లీ టూ బెడ్ ,ఎర్లీ టూ వేక్ అని చిన్నప్పట్నుండి వింటున్నాం. పొద్దున్నే లేవడం వల్ల  ఆరోగ్యంగా ఉంటామని తెలిసినప్పటికీ కూడా బద్దకిస్తుంటాం. దానికి ప్రధానకారణం మన జీవనశైలి. ఈ విష‌యం ప‌క్క‌న పెడితే  ఉద‌యం నిద్ర లేవ‌గానే చాలా మంది చాలా ప‌నులు చేస్తారు. కొంద‌రు బెడ్ కాఫీ లేదా టీతో ఉద‌యాన్ని ఆరంభిస్తే కొంద‌రు లేవ‌గానే ఫోన్ తీసుకుని త‌మ‌కు వ‌చ్చిన మెయిల్స్ చెక్ చేస్తారు. ఇక మ‌రికొంద‌రు అయితే స్మార్ట్‌ఫోన్ ప్ర‌పంచంలో మునిగిపోతారు. అయితే నిజానికి ఇవేవీ కూడా మంచి అల‌వాట్లు కాదు. అలాగే వీటితో పాటు మ‌రిన్ని త‌ప్పులు చేస్తుంటారు.

 

సాధార‌ణంగా చాలా మంది ఉద‌యం నిద్ర లేచాక బెడ్‌ను స‌ర్ద‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. దీంతో బెడ్‌పై దిండ్లు, బెడ్ షీట్లు అలాగే చిందవంద‌ర‌గా ఉంటాయి. ఇలా ఉండ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఉండే తేమ బెడ్‌షీట్లు, దిండ్ల నుంచి అంత త్వ‌ర‌గా ఆవిరి కాదు. దీంతో వాటిపై బాక్టీరియా చేరి జ‌బ్బు ప‌డే అవ‌కాశం ఉంటుంది. చాలామంది చీకట్లో పడుకోవడానికి ఇష్ట పడ్తారు.నిద్ర లేచేప్పుడు కూడా అదే చీకటి గదిలోనే మేల్కొంటారు.దీనివల్ల ఇంకా నిద్రొస్తున్నట్లుగా ఉండడమే కాదు,మెదడు అంతా గందరగోళంగా ఉంటుంది.

 

ఉద‌యం నిద్ర లేవ‌గానే ఖాళీ క‌డుపుతో కాఫీ తాగుతారు. కానీ అలా చేయ‌రాదు. ఖాళీ క‌డుపుతో కాఫీ తాగితే గ్యాస్‌, అసిడిటీ స‌మ‌స్య‌లు పెరుగుతాయి. క‌నుక ఉద‌యం నిద్ర లేచాక కాఫీ తాగేందుకు క‌నీసం నాలుగు గంట‌ల పాటు వేచి ఉండాలి. అలాగే చాలా మంది ఉద‌యాన్నే వేడి నీటి స్నానం చేస్తారు. కానీ ఇది అంత మంచిది కాదు.. ఎందుకంటే వేడి నీరు శ‌రీరానికి రిలాక్సేష‌న్ ఇస్తుంది. దీంతో ఆఫీస్‌లో చురుగ్గా ఉండ‌లేరు. అందుకే ఉద‌యం వేడి నీటి స్నానం క‌న్నా చ‌న్నీళ్లు చేస్తేనే ఉత్త‌మం.

మరింత సమాచారం తెలుసుకోండి: