ఉప్పు... ప్రతిరోజు ఏదో ఒక వంటకంలో తినాల్సిందే.. ఎందుకంటే అది లేకపోతే ఏ వంటకం తినలేము అనుకో. ప్రతి వంటకంలో ఉప్పు అనేది కాస్త అయినా ఉండాలి.. అది అన్నం అయినా కూర అయినా, స్నాక్స్ అయినా ఇలా ఏదైనా సరే ఉప్పు లేనిదే వంట ఉండదు. అయితే ఇంగ్లండ్‌లోని ఎప్సమ్‌ అనే ప్రాంతంలో అమ్మబడే ఎప్సమ్‌ సాల్ట్‌ అంటే భేది ఉప్పుతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. అవి ఎలా ఏంటి అనేది  చదివి తెలుసుకోండి. 

 

ఇంగ్లండ్‌లోని ఎప్సమ్‌ అనే ప్రాంతంలో ఉండే ఎప్సమ్‌ సాల్ట్‌... ‘భేది ఉప్పు’తో పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.మెగ్నీషియం, సల్ఫర్‌, ఆక్సిజన్‌లు కలగలసిన రసాయన లవణం టేబుల్‌ సాల్ట్‌గానే కనిపించినా, దీనికి ఉన్న ప్రత్యేక గుణాలు ఆరోగ్య ప్రయోజనాలకు ఉపయోగపడతాయి. అయితే ఈ ఉప్పును స్నానం నీటిలో కలుపుకొని చేస్తే ఏం అవుతుంది అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

ఈ ఉప్పును స్నానపు నీటిలో కలుపుకుంటే... బాత్ టబ్ లో నీళ్లు నింపి భేది ఉప్పును కలిపి కనీసం గంట పాటు సేద తీరితే ఒంట్లోని విషాలు, లోహాలు వదిలిపోతాయి. దీంట్లో అత్యధిక మెగ్నీషియం శరీరాన్ని సేద తీర్చి, రాత్రి కంటి నిండా నిద్ర పట్టేలా చేస్తుంది. శరీరంలో మెగ్నీషియం కొరత తొలుగుతుంది.

 

ఇన్‌ఫ్లమేషన్‌ కారణంగా తలెత్తే నొప్పులు తగ్గుతాయి. నాడీ వ్యవస్థ, కీళ్ల పనితీరుకు ఉపయోగపడే భేది ఉప్పులోని సల్ఫేట్‌ను శరీరం చక్కగా పీల్చుకుని, ఉపయోగించుకుంటుంది. గౌట్‌, అథ్లెట్స్‌ ఫుట్‌, కాలి బొటనవేలి ఫంగస్‌ మొదలైన సమస్యలు భేది నీటి స్నానంతో అదుపులోకి వస్తాయి. చూశారుగా.. ఈ బేది ఉప్పును స్నానం నీళ్లలో కలుపుకొని చేస్తే ఎంత ప్రయోజనం అనేది.. ఇంకెందుకు ఆలస్యం.. మీకు బేది ఉప్పు దొరికితే వెంటనే మీరు బేది ఉప్పు నీటిలో స్నానం చెయ్యండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: