ఈగలు, దోమలు చూడటానికి చాలా చిన్నగా కనిపిస్తాయి. కానీ ఈగలు, దోమల వలన ఏర్పడే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఒకప్పుడు వర్షాకాలంలో మాత్రమే తీవ్రంగా ఉండే దోమలు ఇప్పుడు అన్ని సీజన్లలోను తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈగలు గుయ్యుగుయ్యిమంటూ మోత మోగిస్తూ చిరాకు తెప్పిస్తాయి. దోమలు, ఈగలను వెళ్లగొట్టటానికి ఉపయోగించే లిక్విడ్స్, జెట్ కాయిల్స్ వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి. 
 
దోమలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే కిటికీల దగ్గర, ఇంటి ప్రాంగణంలో బంతిపూల మొక్కలను పెంచాలి. బంతిపూల మొక్కల నుండి వచ్చే వాసనకు దోమలు రావు. తలుపులు, కిటికీలు మూసి కొద్దిసేపు కర్పూరం వెలిగిస్తే ఆ వాసనకు దోమలు ఇంట్లోకి ప్రవేశించవు. కర్పూరం వెలిగిస్తే దోమలతో పాటు ఈగలు కూడా పోతాయి. తులసి మొక్కలను పెంచడం వలన కూడా దోమల బారి నుండి తప్పించుకోవచ్చు. 
 
ఇంటిని శుభ్రం చేసే నీళ్లలో ఒక స్పూన్ పసుపు వేసి శుభ్రం చేస్తే ఈగలు ఇంట్లోకి రావు. వెల్లుల్లి రసాన్ని నీళ్లలో కలిపి శరీరానికి రాసుకుంటే దోమలు కుట్టవు. దాల్చిన చెక్క, వెల్లుల్లి ముక్కలను చీమలు తిరిగే చోట ఉంచితే చీమలు ఘాటు వాసనను తట్టుకోలేక అక్కడినుండి వెళ్లిపోతాయి. బొద్దింకల సమస్య ఉంటే మూడు కప్పుల నీటిలో తులసి ఆకులు వేసి మరగబెట్టి స్ప్రే చేస్తే బొద్దింకలు రావు. ఇంట్లో సాలీళ్లు ఉంటే రెండు కప్పుల నీళ్లలో కొన్ని చుక్కల పెప్పర్ మెంట్ నూనె పోసి స్ప్రే చేస్తే సాలీళ్ల బెడద నుండి తప్పించుకోవచ్చు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: