ఈ మధ్యకాలంలో వేరే వాళ్ళపై ఆధారపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది. వాళ్ల సామర్థ్యంపై వాళ్ళకి అనుమానం ఉండడంతో ఎక్కువగా పక్క వాళ్ళ పైన ఆధారపడి నిర్ణయాలు  తీసుకుంటూ ఉంటారు. స్నేహితులైన,  కొలీగ్స్ తో నైనా, ఇంకెవరితోనైనా పరిమితికి మించి ఒకరిపై ఒకరు ఆధారపడితే మాత్రం అది మానసిక సమస్యగా మారే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది తమ సామర్థ్యంపై నమ్మకం లేక వేరే వాళ్ళ మీద ఆధార పడుతూ వేరే వాళ్ల నిర్ణయం ప్రకారమే నడుచుకుంటూ ఉంటారు. అయితే ఇది పురుషులు మహిళల్లో ఈ రోజుల్లో ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే పురుషుల కంటే మహిళల్లో ఇది కాస్త ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి వారి కోసమే కొన్ని చిట్కాలు. 

 

 

 

 అన్ని విషయాల్లో  ఇతరులపై ఆధారపడితే మీ గెలుపుకు సరైన గుర్తింపు దక్కదు . లైఫ్ విషయంలో మీ విజయాల విషయంలో ఇతరుల జోక్యం ఒక లిమిట్ వరకు మాత్రమే ఉంటే మంచిది. అలా కాకుండా మీరు ఎక్కువగా వేరే వాళ్ళ పై ఆధారపడితే మీరు గెలిచినప్పటికీ ఆ క్రెడిట్ మొత్తం పక్క వాళ్లకి వెళ్ళిపోతుంది. ఇక గ్రూప్ గా పని చేస్తున్నప్పుడు కూడా గ్రూప్ మొత్తం లో  మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేలా చూసుకోవాలి. ఏదైనా కొత్త విషయాలు చెప్పడానికి లేదా సొంత నిర్ణయాలు తీసుకునేందుకు మొగ్గు చూపాలి. అలాంటప్పుడే గ్రూప్ లో  ఎంతమంది ఉన్నప్పటికీ మీకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. 

 

 

 

అంతేకాకుండా  ఆత్మ విశ్వాసం లోపంతో ఉన్న వారు చాలామంది ... తమ లోపల ఉన్న సమర్థ్యాన్ని  గుర్తించకుండా... ఎక్కువగా ఇతరులపై ఆధారపడేందుకు  ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి వారు చిన్న చిన్న విషయాలను కూడా పెద్దదిగా చేస్తూ  ఉంటారు. ప్రతి విషయంలో ఇతరులు ఏమనుకుంటారో అంటూ మొహమాట పడటం,  భయపడడం చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు సొంత వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటే వీటన్నింటికీ దూరంగా ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

 

 

 గెలుపైనా ఓటమైన డెసిషన్   నాదే అనుకున్నప్పుడు మాత్రమే ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని మానసిక  నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీ నిర్ణయం వల్ల ఓటమి ఎదురైతే ఇతరులు మిమ్మల్ని వేలెత్తి చూపుతారు అనే ఆలోచనను మీ మనసు లోకి రానివ్వకుండా ముందడుగు వేయడంతోపాటు ఓటమిని అంగీకరించే  తత్వం మీలో ఉన్నప్పుడే ఈ సామర్థ్యం మీద మీకు నమ్మకం కలగడంతో పాటు ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంది. ఇక ఇప్పటికైనా మీరు ఇతరులపై ఆధారపడకుండా మీ  సొంత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగండి.

మరింత సమాచారం తెలుసుకోండి: