డిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటారు. అలాగే దేశాన్ని పాలించే మంత్రికి ఐనా తన కూతురు కూతురే. ఇదే విషయాన్ని గంగూలి కూతురు నిరూపించింది. ఇకపోతే ఈ మద్య జరిగిన భారత్‌, బంగ్లాదేశ్‌ చారిత్రక డే/నైట్‌ టెస్టును బీసీసీఐ, బెంగాల్‌ క్రికెట్‌ సంఘం విజయవంతంగా నిర్వహించాయి. ఇందులో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ పిచ్‌ను సిద్ధం చేయడం నుంచి ట్రోఫీ ప్రదానోత్సవం వరకు ఎన్నో బాధ్యతలను మోశారు. అన్నిటినీ చక్కగా పర్యవేక్షించారు. అతిథులను గౌరవించారు.

 

 

ఇకపోతే ఈ మ్యాచ్‌ చూసేందుకు వేలాది మంది అభిమానులు తరలివచ్చి, రెండు జట్ల ఆటగాళ్లను ప్రోత్సహించారు. వారి ఉత్సాహం నీరు గార్చకుండా ఈ పోరులో భారత్‌ ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో ఘన విజయం కూడా సాధించింది. ఇక ఈ మ్యాచ్‌ లో గెలిచిన టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీకి ట్రోఫీ అందించేటప్పుడు దిగిన ఓ చిత్రాన్ని గంగూలీ తాజాగా ఇన్‌స్టాలో పంచుకోగా, ఎంతో మంది దీనిని లైక్‌ చేశారు. ఈ సందర్బంగా ఉన్న ఆ ఫోటోలో దాదా కాస్త సీరియస్‌ లుక్‌లో కనిపించడంతో ఆయన కుమార్తె సనా సరదాగా ట్రోల్‌ చేసింది.

 

 

అదేమంటే ‘మీకు నచ్చనిది ఏంటి?’ అని అడిగింది. ‘అది.. నువ్వు అవిధేయంగా మారిపోవడమే’ అని దాదా చమత్కరించాడు. వెంటనే ఆమె ‘మీ నుంచే నేర్చుకుంటున్నాను’  అని రాసి స్మైలీ ఎమోజీ పెట్టింది. ఇప్పుడు ఇన్‌స్టాలో తండ్రీకూతుళ్ల మద్య జరిగిన ఈ సరదా సంభాషణ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇకపోతే సౌరవ్‌ గంగూలీ మన ఇండియా తరపున టెస్ట్ కెప్టెన్ గా పలు విజయాలు అందించాడు. ఎడమచేతితో బ్యాటింగ్ మరియు కుడిచేతితో మీడియం పేస్ బౌలింగ్ చేయగల గంగూలీకి బెంగాల్ టైగర్, కోల్‌కత యువరాజు, దాదా అనే ముద్దుపేర్లు ఉన్నాయి.

 

 

2002 నుంచి 2005 వరకు భారత టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించి అత్యధిక టెస్ట్ విజయాలు (21) సాధించిపెట్టిన భారత కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. 2003 ప్రపంచ కప్ క్రికెట్ లో ఫైనల్ చేరిన భారత జట్టుకు నాయకుడు కూడా అతనే. 2006 ప్రారంభంలో భారత జట్టునుంచి దూరమైనా మళ్ళీ డిసెంబరులో జట్టులోకి ప్రవేశించి 2006-07 దక్షిణాఫ్రికా పర్యటనలో తన ప్రతిభను నిరూపించాడు. 2008 అక్టోబరులో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీసుతో అంతర్జాతీయ గతి నుండి రిటైర్ అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: